Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు వార్న్‌ సూచన.. ఆస్ట్రేలియాలోనూ డే/నైట్‌ ఆడాలి!!

Shane Warne wants India-Australia day-night Test in Adelaide next year

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా డే/నైట్‌ టెస్ట్‌ ఆడుతుందన్న ఆశాభావాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌ వార్న్‌ వ్యక్తం చేసాడు. దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారి డే/నైట్‌ టెస్ట్‌ ఆడుతున్న విరాట్ కోహ్లీ సేనకు శుభాకాంక్షలు తెలిపాడు. వచ్చే ఏడాది నవంబరు నుంచి ఆస్ట్రేలియా పర్యటన జరగనుంది. అందులో ఆస్ట్రేలియాతో 4 టెస్ట్‌లు భారత్‌ ఆడనుంది. అయితే అడిలైడ్‌ టెస్ట్‌ను డే/నైట్‌లో ఆడేందుకు టీమిండియా అంగీకరించాలని వార్న్‌ కోరాడు.

ఆస్ట్రేలియాలోనూ ఆడండి:

ఆస్ట్రేలియాలోనూ ఆడండి:

'ఇప్పుడు భారత్‌లో డే/నైట్‌ టెస్ట్‌ ఆడేందుకు అంగీకరించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం ఆసీస్‌ టూర్‌లో అడిలైడ్‌లోనూ టీమిండియా మరో డే/నైట్‌ టెస్ట్‌ ఆడుతుందని ఆశిస్తున్నా' అని వార్న్‌ ట్వీట్‌ చేశాడు. వార్న్‌ 145 టెస్టులు, 194 వన్డేలు ఆడి.. 708, 293 వికెట్లు తీసాడు.

 వెల్‌డన్‌ సౌరవ్‌:

వెల్‌డన్‌ సౌరవ్‌:

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కూడా సౌరవ్‌ను అభినందించాడు. 'వెల్‌డన్‌ సౌరవ్‌. వచ్చే ఏడాదిఆస్ట్రేలియా లోనూ ఒకటి రెండు గులాబీ మ్యాచ్‌లు జరుగుతాయని భావిస్తున్నా' అని వాన్‌ ట్వీట్‌ చేశాడు. భారత్, బంగ్లా జట్లను గులాబీ బంతితో ఆడేందుకు సౌరవ్‌ ఒప్పించిన విషయం తెలిసిందే.

గులాబీ బంతే స్పష్టంగా కనిపిస్తుంది

గులాబీ బంతే స్పష్టంగా కనిపిస్తుంది

చారిత్రక డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా దాదా మీడియాతో మాట్లాడారు. సంధ్య వెలుగులో బంతిని గుర్తించడం సంక్లిష్టంగా ఉంటుందని వాదనలు వచ్చాయి. ఈ విషయమై ప్రశ్నించగా.. 'ఎరుపు బంతి కన్నా గులాబి బంతే బాగా కనిపిస్తోంది' అని దాదా సమాధానం ఇచ్చాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీమిండియా గులాబి బంతితో డే/నైట్‌ టెస్టు ఆడుతుందా అన్న ప్రశ్నకు మాత్రం గంగూలీ కచ్చితమైన సమాధానం ఇవ్వలేదు.

Story first published: Sunday, November 24, 2019, 9:54 [IST]
Other articles published on Nov 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+