For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసక్తిగా: ధోని కెప్టెన్‌గా షేన్ వార్న్ ఐపీఎల్ 'All-time XI'

తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ తన 'All-time XI' ఐపీఎల్ జట్టుని ప్రకటించ

By Nageshwara Rao

హైదరాబాద్: తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ తన 'All-time XI' ఐపీఎల్ జట్టుని ప్రకటించాడు. రైజింగ్ పూణె సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీని కెప్టెన్‌గా ఎంచుకున్న షేన్ వార్న్, విదేశీ ఆటగాళ్ల కోటాలో క్రిస్ గేల్, మెక్‌కల్లమ్, జాక్వస్ కల్లిస్, లసిత్ మలింగలకు చోటు కల్పించాడు.

ప్రస్తుతం పదో ఐపీఎల్‌ జరుగుతున్న సందర్భంగా షేన్ వార్న్ 'All-time XI' జట్టుని ప్రకటించి ఆసక్తి కలిగించాడు. ఫేస్‌బుక్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా ఐపీఎల్ చరిత్రలో తాను భావించే అత్యుత్తమ జట్టు ఇదీ అని ప్రకటించాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్‌లో షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది.

Shane Warne unveils his IPL 'All-time XI'; MS Dhoni is captain

ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభానికి ముందు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ప్రాంఛైజీ ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్ధానంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ పుల్ కెప్టెన్‌గా ధోనికి పేరుంది. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు కూడా ధోని పేరిట ఉంది. 143 ఇన్నింగ్స్‌లకు ధోని కెప్టెన్‌గా ఉండగా అందులో 83 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 59 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. ఇదిలా ఉంటే వార్న్ ప్రకటించిన జాబితాలో ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన సురేశ్ రైనా పేరు లేకపోడవం విశేషం.

షేన్ వార్న్ "All-time IPL XI":

1. Chris Gayle (Overseas player) - West Indies - Royal Challengers Bangalore (RCB)
2. Brendon McCullum (Overseas) - New Zealand - Gujarat Lions (GL)
3. Jacques Kallis (Overseas) - South Africa - Kolkata Knight Riders (KKR) coach
4. Virat Kohli (RCB)
5. Rohit Sharma (Mumbai Indians - MI)
6. Yuvraj Singh (Sunrisers Hyderabad - SRH)
7. Mahendra Singh Dhoni (captain) - Rising Pune Supergiant (RPS)
8. Ravindra Jadeja (GL) 9. Harbajan Singh (MI)
10. Lasith Malinga (Overseas) - Sri Lanka (MI)
11. Umesh Yadav (KKR)

Note: దక్షిణాఫ్రికాకు చెందిన కల్లిస్ ప్రస్తుతం కోచ్‌గా ఉన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+