సిడ్నీ: భారత దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆందోళన వ్యక్తం చేశాడు. అద్భుతమైన భారత దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం విచారకరమని పేర్కొన్నాడు. కరోనాపై భారత్ యుద్ధం కొనసాగిస్తున్నందున ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, అందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వార్న్ కోరాడు. సెకండ్ వేవ్ కారణంగా భారత్‌లో భయానక పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.
Prachi Singh: వైరల్ వీడియో.. పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్ 'బెల్లీ డ్యాన్స్' అదరగొట్టిందిగా!!
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో రోజురోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే షేన్ వార్న్స్పందించాడు. 'ఈ భయంకరమైన సమయంలో భారత్‌లోని నా స్నేహితుల గురించి ఆలోచిస్తున్నా. దయచేసి మీరు సురక్షితంగా ఉంటూ.. మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి. అద్భుతమైన మీ దేశంలో పరిస్థితి చాలా విచారకరంగా ఉంది. భారత్‌కు నా ప్రేమ, మద్దతు ఎల్లవేళలా ఉంటుంది' అని వార్న్ ట్వీట్ చేశాడు. దీంతో భారత దేశంపై ఉన్న తన ప్రేమని వార్న్ చాటుకున్నాడు.
దేశంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. 4 లక్షలకుపైగా రోజువారీ కేసులు, 4 వేలకు చేరువగా మరణాలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 414188 కొత్త కేసులు నమోదయ్యాయి. 4 లక్షలకుపైగా కేసులు చోటుచేసుకోవడం దేశంలో ఇది మూడోసారి. ఇక మరణాలు వరుసగా పదో రోజు 3 వేలకుపైగా నమోదయ్యాయి. తాజాగాకరోనాతో పోరాడుతూ 3915 మంది మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో పాల్గొనే ముందు అన్ని అంశాలు చూసుకొని, మున్ముందు రాబోయే సమస్యలను అంచనా వేసి సంతకాలు పెట్టాలని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) తమ ఆటగాళ్లను హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశంలోకి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఐపీఎల్ 2021లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లంతా ఒక రకంగా చిక్కుకుపోయారు. నేరుగా స్వదేశం వెళ్లలేక ఇప్పుడు మాల్దీవుల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనినే ఏసీఏ గుర్తు చేసింది.