Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి షేన్ వార్న్‌..?

Shane Warne's Suspense Tweet Fuels Talk Of Rajasthan Royals Reunion

హైదరాబాద్: కొన్ని సీజన్లకు గాను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ షేన్ వార్న్ మళ్ళీ జట్టులోకి రానున్నాడా..? అతను జట్టులోకి వస్తే ఏ పదవిలో కొనసాగనున్నాడు. ఇదే ఐపీఎల్ అభిమానులు ట్విట్టర్ వేదికగా క్రికెట్ అభిమానులు సంధిస్తున్న ప్రశ్న.

ఈ విషయం ప్రస్తావించడానికి కారణం. షేన్ వార్న్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వారంలోనే భారీ స్థాయిలో అనౌన్స్‌మెంట్ చేయబోతున్నానని పోస్ట్ చేశాడు. దానికి స్పందించిన నెటిజన్లు ప్రధాన కోచ్‌గా రానున్నారా, కోచ్‌గా వస్తారా, మిమ్మల్ని మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్‌గా చూడటం ఆనందంగా ఉందంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఐపీఎల్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న షేన్ వార్న్ ఏ పదవిలో కొనసాగుతాడనేది రాజస్థాన్ రాయల్స్ ద్వారా అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. షేన్ వార్న్ ఖచ్చితంగా ఈ ఐపీఎల్‌లో తను కనిపించబోతున్నానని పేర్కొన్నాడు. కానీ, ఎలా కనిపించబోతున్నాడనేది సస్సెన్స్ గానే ఉంచాడు.

ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే ఆస్ట్రేలియన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలోనే ఉంచింది. ఇంకా బెంగుళూరులో జరిగిన రెండు రోజుల వేలంలో నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు మొత్తంలో జాదేవ్ ఉన్‌దక్త్ ఒక్కడే రూ. 11.50కోట్లుగా అందరి కంటే ఎక్కువ ధర పలికి ఖరీదైన ఆటగాడు. రెండేళ్ల నిషేదం అనంతరం ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతున్న పదకొండో సీజన్లో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Story first published: Tuesday, February 6, 2018, 14:54 [IST]
Other articles published on Feb 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+