మరో దిగ్గజ ఆత్మకథ 'నో స్పిన్' రూపంలో..

సిడ్నీ: కొద్ది నెలల ముందు విడుదలై క్రీడా ఔత్సాహికుల్లో ఆనందం నింపిన ఆత్మకథ 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' గంగూలీ బయోగ్రఫీని అతనే రాసి విడుదల చేశారు. అతని అరంగ్రేట మ్యాచ్ నుంచి సచిన్.. ధోనీ వంటి క్రీడా ప్రముఖుల గురించి చర్చించిన ఆ పుస్తకంలో మరెన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి. అయితే మరో క్రికెట్ దిగ్గజం తన ఆత్మకథను అభిమానుల ముందు ఉంచబోతున్నాడు.
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ త్వరలో తన ఆత్మకథతో మనందరినీ పలకరించనున్నాడు. తన మణికట్టు మాయాజాలంతో గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసిన వార్న్ తన ఆత్మకథకు పెట్టుకున్న పేరేంటో తెలుసా 'నో స్పిన్' ఈ అక్టోబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. తన ఆత్మకథలో వార్న్ ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని వ్యక్తిగత వివరాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సత్యాసత్యాలు తెలియజేయనున్నాడు.
గొప్ప క్రీడాకారుల ఆత్మకథల సరసన 'నో స్పిన్' నిలుస్తుందని పబ్లిషర్ ఈబరీ తెలిపింది. వార్న్ సేవలు లేకుండా క్రికెట్‌ను ఊహించలేమని, బ్రిటన్‌లోనూ అతను సెలెబ్రిటీ అని పేర్కొంది. వార్న్‌తో కలిసి టీవీ ప్రజెంటర్ మార్క్ నికోలస్ ఈ ఆత్మకథను రాశారు. కాగా, దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ విదేశీ పర్యటనల్లో ప్రత్యర్థి జట్టు క్రికెటర్ల గురించి చర్చిస్తారో లేదో చూడాలి.
ప్రపంచంలోని అత్యంత గొప్ప స్పిన్నర్లలో ఒకడిగా భావించే షేన్‌వార్న్ 1969, సెప్టెంబర్ 13న జన్మించారు. 1992లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు వన్డే, టెస్టుల్లో కలిపి 1000 వికెట్లకు పైగా పడగొట్టాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాట్స్‌మన్‌గా 3000 వరకు పరుగులు చేశాడు. తన సొంత రాష్ట్రం విక్టోరియా, ఇంగ్లాండ్‌లో హ్యాంప్‌షైర్ తరఫున ఆడిన వార్న్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్సీ వహించి తొలి టైటిల్ అందించాడు. షేన్ వార్న్ అన్నీ ఫార్మాట్లకు కలిపి 2013వ సంవత్సరంలో రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications