For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధం'

By Nageshwara Rao
Shane Warne ready to take the coaching responsibilities of the Australian team

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కోచ్‌‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ చెప్పాడు. ప్రస్తుతం ఆ జట్టుకు కోచ్‌గా ఉన్న డారెన్ లీమ‌న్‌ 2019 చివర్లో ప్రధాన కోచ్‌ పదవికి వీడ్కోలు పలుకుతానని ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

లీమన్ వ్యాఖ్యల నేపథ్యంలో షేన్ వార్న్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 'ఏ దేశానికైనా కోచ్‌ బాధ్యతలు నిర్వహించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అయితే నా తొలి ప్రాధాన్యత మాత్రం ఆస్ట్రేలియాకే. కోచ్‌గా కాకపోయినా ఆసీస్‌ జట్టుకు ఎలాంటి సేవలు అందించడానికైనా నేను ఎల్లప్పుడూ సిద్ధమే' అని తెలిపాడు.

'బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో ఆస్ట్రేలియా జట్టుకు చాలా మంచి కోచ్‌లు ఉన్నారు. ఒకవేళ లీమ‌న్‌ తన స్థానంలో నన్ను కొనసాగమంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇదంతా కూడా సమయంపై ఆధారపడి ఉంటుంది' అని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు.

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ప్రస్తుతం షేన్ వార్న్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఆస్ట్రేలియా తరుపున 145 టెస్టు మ్యాచ్‌లాడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో వార్న్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

2013లో కోచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డారెన్ లీమన్‌ పర్యవేక్షణలో ఆస్ట్రేలియా జట్టు స్వదేశంలో రెండు యాషెస్ సిరిస్‌లను గెలుచుకోగా, ఇంగ్లాండ్‌లో రెండు యాషెస్ సిరిస్‌ల్లో ఓటమి పాలైంది. అంతేకాదు 2015 వన్డే వరల్డ్ కప్‌ను కూడా గెలుచుకుంది.

భారత పర్యటనలో ఆసీస్‌ ఘోర ఓటమి కారణంగా అప్పటి కోచ్‌గా ఉన్న మికీ ఆర్థర్‌పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా లీమన్‌కు ఆ పదవిని అప్పజెప్పింది. తనకు అందివచ్చిన అవకాశాన్ని డారెన్ లీమన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అనేక ఆసీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే డారెన్ లీమన్ స్థానాన్ని ఆసీస్ మాటీ టెస్టు ఓపెనర్ జస్టిన్ లాంగర్ భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోచ్ రేసులో లాంగర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 20:11 [IST]
Other articles published on Dec 26, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+