భారత్ గ్రేటెస్ట్ ఎలెవెన్ కెప్టెన్ గంగూలీ: షేన్‌వార్న్

Shane Warne Picks Sourav Ganguly As Captain Of Indias Greatest XI

సిడ్నీ: టీమిండియా గ్రేటెస్ట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అని ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ తెలిపాడు. బుధవారం సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర చర్చను తెరదీసిన ఈ మాజీ స్పిన్నర్.. తను క్రికెట్‌ ఆడిన కాలంలోని 11 మంది ఆటగాళ్లతో కూడిన అత్యుత్తమ భారత జట్టును ప్రకటించాడు. అయితే ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగిన సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు వార్న్‌ తన జట్టులో అవకాశం ఇవ్వలేదు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా పెద్ద దుమారం రేగింది.

అందుకే లక్ష్మణ్‌ను ఎంపిక చేయలేదు..

అందుకే లక్ష్మణ్‌ను ఎంపిక చేయలేదు..

అయితే దీనిపై వివరణ ఇచ్చిన వార్న్‌ జట్టు కూర్పులో భాగంగానే లక్ష్మణ్‌కు చోటు ఇవ్వలేదని తెలిపాడు. అంతేకాకుండా సారథి గంగూలీ కోసమే లక్ష్మణ్‌ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని సరదాగా పేర్కొన్నాడు. తను ఎంపిక చేసిన 11 మందిలో సారథిగా ఎవరిని ఎంపిక చేయాలో తెలియక లక్ష్మణ్‌ను తప్పించి గంగూలీని జట్టులోకి తీసుకొని సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపాడు.

అయితే కపిల్‌ దేవ్‌, అజహరుద్దీన్‌లను ఎంపిక చేసినప్పటికీ వారికి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడానికి వార్న్‌ అనాసక్తి కనబర్చడం విశేషం. ఇక ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లిలతో తను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోవడంతో వారిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాడు.

ఓపెనర్లుగా సెహ్వాగ్.. నవజ్యోత్ సింగ్

ఓపెనర్లుగా సెహ్వాగ్.. నవజ్యోత్ సింగ్

ఓపెనర్లుగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, వీరేంద్ర సెహ్వాగ్‌లవైపే వార్న్‌ మొగ్గు చూపాడు. స్పిన్‌ బౌలింగ్‌లో ముఖ్యంగా తన బౌలింగ్‌లో ఏమాత్రం ఇబ్బంది పడని సిద్దూను ఓపెనర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపిన అతడు.. సచిన్‌, ద్రవిడ్‌లు లేకుండా అత్యుత్తమ భారత జట్టును ఎంపిక చేయడం కష్టం అని పేర్కొన్నాడు. ఇక తన స్పిన్‌తో ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్‌కు భారత్‌పై మాత్రం మెరుగైన రికార్డు లేకపోవడం విడ్డూరం. టీమిండియాతో జరిగిన 24 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 43 వికెట్లను మాత్రమే పడగొట్టాడు.

వార్న్‌ అత్యుత్తమ భారత జట్టు

వార్న్‌ అత్యుత్తమ భారత జట్టు

సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌, మహ్మద్‌ అజహరుద్దీన్‌, నయాన్‌ మోంగియా, కపిల్‌ దేవ్‌, హర్భజన్‌ సింగ్‌, అనిల్‌ కుంబ్లే, జవగల్‌ శ్రీనాథ్‌

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 1, 2020, 18:31 [IST]
Other articles published on Apr 1, 2020
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more