Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇనిస్టాగ్రామ్‌లో వైరల్: అడిలైడ్ టెస్టుకు జట్టుని ఎంపిక చేసిన షేన్ వార్న్

India vs Australia 2018-2019 : Shane Warne Picks His 12 Men Sqaud For 1st Test in Adelaide| Oneindia
Shane Warne picks his XI for first Test in Adelaide

హైదరాబాద్: సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు లేకపోవడంతో ఈ సిరిస్‌లో కోహ్లీసేన ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

స్మిత్, వార్నర్ లేకున్నా సొంత గడ్డపై ఆస్ట్రేలియా సత్తా చాటుతుందని ఆ దేశానికి చెందిన పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. మూడు టీ20ల సిరిస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ప్రారంభం కానుంది. డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

అడిలైడ్ టెస్టు జట్టుని ఎంపిక చేసిన వార్న్

అడిలైడ్ టెస్టు జట్టుని ఎంపిక చేసిన వార్న్

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ తొలి టెస్టు కోసం పదకొండు మంది సభ్యులతో కూడిన జట్టుని ఎంపిక చేశాడు. షేన్ వార్న్ ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లుగా ఆరోన్ ఫించ్, ఖవాజాలను ఎంచుకున్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో మార్ష్ ఎస్, ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, పైనీ, మార్ష్ ఎమ్ లకు చోటు కల్పించాడు.

ఆసీస్‌లో ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవని భారత్

ఆసీస్‌లో ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవని భారత్

ఇక, బౌలర్లలో కమ్మిన్స్, స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజెల్‌ఉడ్‌లను ఎంపిక చేశాడు. ఈ జట్టుని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు.

షేన్ వార్న్ ఎంపిక చేసిన టెస్టు జట్టు

1. ఆరోన్ ఫించ్ (వైస్ కెప్టెన్)

2. ఖవాజా

3. మార్ష్ ఎస్

4. ట్రావిస్ హెడ్

5. మార్కస్ స్టోయినిస్

6. పైనీ(కెప్టెన్)

7. మార్ష్ ఎమ్

8. కమ్మిన్స్

9. స్టార్క్

10. నాథన్ లియాన్

11. హాజెల్‌ఉడ్

 తొలి టీ20 నవంబర్ 21న ప్రారంభం

తొలి టీ20 నవంబర్ 21న ప్రారంభం

తొలి టీ20 నవంబర్ 21న ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్, జనవరి 3 నుంచి మూడు వన్డేల సిరిస్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో భారత్ తలపడే మ్యాచ్‌ల షెడ్యూల్, ఇరు జట్లు, లైవ్ టెలీకాస్ట్ సమయాలను మీకోసం:

ఛానల్: స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్

లైవ్ స్ట్రీమింగ్: Hotstar.com

మూడు టీ20లు

మూడు టీ20లు

తొలి టీ20: నవంబర్ 21 - గబ్బా, బ్రిస్బేన్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)

రెండో టీ20: నవంబర్ 23 - ఎంసీజీ, మెల్‌బోర్న్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

మూడో టీ20: నవంబర్ 25 - ఎస్‌సీజీ, సిడ్నీ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

టెస్టు సిరిస్

టెస్టు సిరిస్

తొలి టెస్ట్: డిసెంబర్ 6 నుంచి 10 వరకు - అడిలైడ్ (ఉదయం 6 గంటల నుంచి)

రెండో టెస్ట్: డిసెంబర్ 14 నుంచి 18 వరకు - పెర్త్ (ఉదయం 8 గంటల నుంచి)

మూడో టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 వరకు - మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటల నుంచి)

నాలుగో టెస్ట్: జనవరి 3 నుంచి 7 వరకు - సిడ్నీ (ఉదయం 5 గంటల నుంచి)

 వన్డే సిరిస్

వన్డే సిరిస్

తొలి వన్డే: జనవరి 12 - సిడ్నీ (ఉదయం 8.50 గంటలకు)

రెండో వన్డే: జనవరి 15 - అడిలైడ్ (ఉదయం 9.20 గంటలకు)

మూడో వన్డే: జనవరి 18 - మెల్‌బోర్న్ (ఉదయం 8.50 గంటలకు)

Story first published: Tuesday, November 20, 2018, 12:28 [IST]
Other articles published on Nov 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+