న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ సిరీస్‌.. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లను ప్రకటించిన షేన్‌ వార్న్‌

Shane Warne picks his Australia and England teams for first Ashes Test

మెగా టోర్నీ ప్రపంచకప్‌ ముగిసింది. ఇక అన్ని దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొంటున్నాయి. విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ పసికూన ఐర్లాండ్‌తో జరగబోయే ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతుండగా.. సెమీస్ నుండి నిష్క్రమించిన ఆస్ట్రేలియా విశ్రాంతి తీసుకుంటోంది. ఇక చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ త్వరలో ప్రారంభం కాబోతోంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

ఉత్సాహంతో ఇంగ్లండ్:

18 నెలల క్రితం జో రూట్ సారథ్యంలోని ఇంగ్లండ్ 4-0తో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్‌లో జరిగిన చివరి నాలుగు సిరీస్‌లను గెలుచుకున్న ఆసీస్‌కు ప్రస్తుత సిరీస్ గెలవాలంటే కష్టపడాల్సిందే. స్వదేశంలో ఇటీవల సాధించిన విజయాలతో ఇంగ్లండ్ ఉత్సాహంగా ఉంది. మరోవైపు సొంత గడ్డపై సిరీస్ జరగడం కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో ఇరు జట్లూ పోటాపోటీగా తలపడే అవకాశం ఉంది.

తొలి టెస్టుకు వార్న్‌ జట్లు:

తొలి టెస్టుకు వార్న్‌ జట్లు:

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాజీ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరిగే తొలి టెస్టులో తలపడే తన కలల జట్లను ప్రకటించాడు. ట్వీటర్‌ వేదికగా ఆసీస్‌, ఇంగ్లండ్ జట్టును ప్రకటించాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఎక్స్‌ట్రా ఆటగాళ్లను కూడా ఎంపిక చేసాడు. ప్రపంచకప్‌ హీరోలు జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ మరియు మార్క్ వుడ్‌లను ఎంపిక చేశారు. అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్‌సన్‌లను కూడా తీసుకున్నాడు. ఆసీస్ జట్టులో మాత్రం హూహించిన వారికే చోటు కల్పించాడు.

ఆస్ట్రేలియా జట్టు:

డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ హారిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, మాథ్యూ వేడ్‌, టిమ్‌ పైన్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, నాథన్‌ లయన్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌. ఎక్స్‌ట్రా ఆటగాళ్లు (ఆలెక్స్‌ కారే, జై రిచర్డ్‌సన్‌, క్యామెరన్‌ బెన్‌క్రాఫ్ట్‌, మిచెల్‌ మార్ష్‌, విల్‌ పుకోవస్కి).

ఇంగ్లాండ్‌ జట్టు: జేసన్‌ రాయ్‌, జాక్‌ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, బెన్‌ ఫోక్స్‌, మోయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌, స్టువర్డ్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్‌సన్‌, మార్క్‌ వుడ్‌.

Story first published: Tuesday, July 23, 2019, 13:01 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X