
హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం డారెన్ లీమన్ 2019 చివరి వరకు కోచ్‌గా కొనసాగుతానని పేర్కొన్నాడు. 'సుదీర్ఘ కాలంగా ఆసీస్ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్నా. నాకు అప్పచెప్పిన పనిని ఎంతగానో ఎంజాయ్ చేశా. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇక తిరిగి కోచ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్దంగా లేను. 2019 చివరి వరకూ కోచ్‌గా కొనసాగుతా' అని లీమన్ చెప్పాడు.
ప్రస్తుతం ఆ దేశ మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తోన్న డారెన్ లీమన్ 2019 ప్రపంచకప్ తర్వాత తాను ఈ పదవికి వీడ్కోలు చెప్తానని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో షేన్ వార్న్ మాట్లాడుతూ.. 'ఏ దేశానికైనా కోచ్ బాధ్యతలు నిర్వహించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ముందు ప్రాధాన్యత మాత్రం ఆసీస్‌కే. కోచ్‌గా కాకపోయినా ఆసీస్ జట్టుకు ఎలాంటి సేవలు అందించడానికైనా నేను ఎల్లప్పుడూ సిద్ధమే. మనకు చాలా మంచి కోచ్‌లు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లో. ఒకవేళ లీమన్ తన స్థానంలో నన్ను కొనసాగమంటే నాకెలాంటి అభ్యంతరం లేదు' అని తన మనసులోని మాటను వెల్లడించాడు వార్న్. ప్రస్తుతం వార్న్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో షేన్ వార్న్ తన స్పిన్ మాయాజాలంతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 145 మ్యాచుల్లో 708 వికెట్లు తీసి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. 2013లో డారెన్ లీమన్ ఆసీస్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన హయాంలో ఆసీస్ జట్టు మరుపురాని విజయాలను సొంతం చేసుకుంది. సొంతగడ్డపై రెండు యాషెస్ సిరీస్ విజయాలతో పాటు 2015 ప్రపంచకప్‌ను అందుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.