Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపిఎల్‌లో ఇది నాకు చివరి సంవత్సరం: షేన్‌వార్న్

Shane Warne
జైపూర్: రాజస్దాన్ రాయల్స్ కెప్టెన్ షేన్‌వార్న్ ఐపిఎల్ 4తనకి చివరి ఐపిఎల్ సీజన్‌ అని అన్నారు. రాబోయే ఐపిఎల్ సీజన్‌లో తాను ఆడడం లేదని స్పష్టం చేశాడు. 41సంవత్సరాల వయసు కలిగినటువంటి షేన్ వార్న్ 2008లోఐపిఎల్‌లో అండర్ డాగ్స్‌‌గా ఉన్నరాజస్దాన్ రాయల్స్‌కి ఐపిఎల్ ట్రోఫీని సాధించి పెట్టడంలో అధ్బుతమైన ఆటతీరుని ప్రదర్శించాడు. తను రాబోయే కాలంలో ఐపిఎల్‌లో ఆడనప్పటికీ రాజస్దాన్ రాయల్స్ టీమ్‌ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశాడు. రాజస్దాన్ రాయల్స్ ఫ్రాంజైజీకి తాను ఎడ్వైజరీ రోల్‌ని పోషించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్బంలో షేన్‌వార్న్అన్న మాటలివి. ఐపిఎల్‌లో ఇది నాకు చివరి సంవత్సరం. మేము మా హొం గ్రౌండ్‌లో ఆడేటటువంటి రెండు గేమ్‌లకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించలసిందిగా కోరుతున్నాం అన్నారు. రాజస్దాన్ రాయల్స్ రాబోయే రోజుల్లో తన హొం గ్రౌండ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడనుంది. ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న లెజండరీ లెగ్ స్పిన్నర్ షేన్‌వార్న్ 2005వ సంవత్సరంలో అంతర్జాతీయ వన్డేల నుండి, ఆ తర్వాత 2007వ సంవత్సరంలో టెస్టుల నుండి వైదోలిగినట్లు తన ట్విట్టర్ పేజిలో రాసుకున్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి వైదోలిగిన తర్వాత షేన్‌వార్న్ ఆడుతున్నటువంటి క్రికెటే ఈవెంట్ ఐపిఎల్ కావడం విశేషం. వచ్చే సంవత్సరం నేను రాజస్దాన్ రాయల్స్ కోచ్ లేక మెంటార్‌గా ఉండే రాజస్దాన్ రాయల్స్‌ని ముందుకు తీసుకోని వెళ్శడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇక షేన్‌వార్న్ విషయానికి వస్తే తన ఇంటర్నేషనల్ కెరియర్ విషయానికి వస్తే టెస్టులలో 708వికెట్లు, వన్డేలలో 293 వికెట్లు తీసుకోవడం జరిగింది.

నాకు సపోర్టు ఇచ్చినందుకు మా టీమ్‌మేట్స్ మరియు నా అభిమానుల అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. దానికి కారణం ఐపిఎల్‌లో ఆడడం ఎంతో ఎంజాయ్‌గా ఉండినందుకు అని అన్నారు. షేన్‌వార్న్ అప్పుడప్పుడు వార్తల్లోకి కూడా వస్తుంటారు. ముఖ్యంగా బ్రిటిష్ యాక్టర్ ఎలిజిబెత్ హార్లేతో చాలా సార్లు రోమాన్స్ చేశాడని వార్తల్లోకి వచ్చారు. ఇక షేన్‌వార్న్ రాజస్దాన్ రాయల్స్ తరుపున ఆడినటువంటి 52 మ్యాచ్‌లలో 53వికెట్లు తీసుకోని 24.66యావరేజిని సాధించారు. ఐపిఎల్ ప్రారంభించినప్పడి నుండి మోస్ట్ సక్సెస్‌పుల్ కెప్టెన్స్‌లలో షేన్‌వార్న్ కూడా ఒకరుగా ఉన్నాడు.

ప్రస్తుతం రాజస్దాన్ రాయల్స్ టీమ్ ఐపిఎల్ పాయింట్ల పట్టికలో నాల్గవ స్దానంలో ఉంది. ఐపిఎల్ 1లో మేము ఏవిధంగానైతే స్పిరిట్‌తో ఆడామో ఇప్పుడు కూడా అదే స్పిరిట్‌తో ఆడడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది యంగ్ ప్లేయర్స్ డవలప్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+