సిడ్నీ: సీట్ బెల్డ్ ధరించనందుకు గాను తస్మానియన్ పోలీసులు ఆస్ట్రేలియా లెజెండరీ బౌలర్ షేన్ వార్న్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌లకు 300 డాలర్ల జరిమానా విధించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ని షేన్ వార్న్ తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేశాడు.
వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల హోబర్ట్‌లో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ వ్యాన్‌ని డ్రైవ్ చేస్తుండగా, ఫ్రంట్ సీట్‌లో టేలర్‌తో పాటు కూర్చున్న మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలే సీట్ బెల్ట్ ధరించారు.

ఇదే వ్యాన్‌లో వెనకు సీట్‌లో కూర్చున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ స్లేటర్ కూడా సీట్ బెల్ట్‌ని ధరించలేదు. వీరంతా కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య హోబర్ట్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కామెంటేటర్లుగా వ్యవహరించారు.
హోబర్డ్ స్టేడియాన్ని చేరుకునేందుకు వీరంతా ఒకే వ్యాన్‌లో ప్రయాణించారు. ఈ క్రమంలో వీరు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించడంతో తస్మానియన్ పోలీసులు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఈ బృందానికి జరిమానా విధించినట్లు టెలిగ్రాఫ్ ఓ కథనంలో పేర్కొంది.