పింక్ జెర్సీలో రాజస్థాన్: బ్రాండ్ అంబాసిడర్‌గా షేన్ వార్న్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు 2008లో ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
2011 వరకు రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన షేన్ వార్న్ ఆ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గత సీజన్‌లో రాయల్స్ జట్టుకు వార్న్ మెంటార్‌గా ఉన్నాడు. మరోవైపు ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు బ్లూ జెర్సీలతో ఆడిన ఆ జట్టు ఈ సీజన్‌లో పింక్ జెర్సీలు ధరించనుంది.
గులాబీ రంగుకు, రాజస్థాన్‌కు అవినాభావ సంబంధం ఉందని.. దానిని ప్రతిబింబించే విధంగా ఈ సీజన్‌లో జెర్సీ రంగును మార్చినట్టు ఫ్రాంచైజీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications