Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షేన్‌ వార్న్‌ 'వరల్డ్ వన్డే జట్టు'.. ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు.. రికీ, గిల్లీలకు నిరాశ!!

Shane Warne Ignores Ricky Ponting And Adam Gilchrist In Greatest ODI XI Of His Era

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ ఇటీవలే టీమిండియా గ్రేటెస్ట్ లెవ‌న్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వరల్డ్ గ్రేటెస్ట్ లెవ‌న్ జ‌ట్టును ప్ర‌కటించాడు. మంగ‌ళ‌వారం ఇన్​స్టాగ్రామ్​ వేదిక‌గా 11 మంది పేర్ల‌తో కూడిన వరల్డ్ గ్రేటెస్ట్ లెవ‌న్ జ‌ట్టును ప్ర‌క‌టించాడు. తాను ఆడినా కాలంలో ఉన్న‌టువంటి ప్లేయ‌ర్ల‌లో ఈ జ‌ట్టును రూపొందించాడు. ఈ జట్టులో భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్​, వీరేందర్ సెహ్వాగ్​కు చోటిచ్చాడు.

ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు:

ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు:

వీరేందర్ సెహ్వాగ్​తో పాటు మరో ఓపెనర్​గా శ్రీలంక మాజీ బ్యాట్స్​మన్ సనత్ జయసూర్యను వార్న్ తీసుకున్నాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్​తో పాటు విండీస్ దిగ్గజం లారా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్​, శ్రీలంక మాజీ సారథి సంగక్కరను తన జట్టులో ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్‌గా అండ్రూ ఫ్లింటాఫ్.. బౌలర్లుగా అక్రమ్​, వెటోరి, అక్తర్​, అంబ్రోస్​ను వార్న్​ ఎంపిక చేశాడు. బౌలింగ్​ విభాగంలో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటివ్వలేదు. అయితే ఆసీస్ దిగ్గజాలు గిల్ క్రిస్ట్, రికీ పాంటింగ్‌లకు షేన్‌ వార్న్‌ చోటివ్వలేదు.

టెస్టు క్రికెట్‌లో 708 వికెట్లు:

టెస్టు క్రికెట్‌లో 708 వికెట్లు:

టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు సాధించిన రెండో బౌల‌ర్ షేన్‌ వార్న్ కావ‌డం విశేషం. శ్రీలంక దిగ్గ‌జం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ త‌ర్వాత అత్య‌ధిక వికెట్లు తీసాడు. వార్న్ 145 టెస్టులాడి 708 వికెట్లు తీశాడు. అలాగే 194 వ‌న్డేల్లో 293 వికెట్లు తీశాడు. 1999 వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌ను ఆసీస్ గెల‌వ‌డంతో వార్న్ కీల‌క‌పాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జ‌రిగిన ఫైనల్లో నాలుగు వికెట్ల‌తో స‌త్తాచాటాడు.

వార్న్ గ్రేటెస్ట్ వరల్డ్ వన్డే ఎలెవెన్​

వార్న్ గ్రేటెస్ట్ వరల్డ్ వన్డే ఎలెవెన్​

వీరేందర్ సెహ్వాగ్​, సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, కెవిన్ పీటర్సన్​, కుమార్ సంగక్కర (వికెట్ కీపర్​), అండ్రూ ఫ్లింటాఫ్​, వసీం అక్రమ్​, డానియెల్ వెటోరి, షోయబ్ అక్తర్​, సునీల్ ఆంబ్రోస్​.

వార్న్‌ అత్యుత్తమ భారత జట్టు:

వార్న్‌ అత్యుత్తమ భారత జట్టు:

సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌, మహ్మద్‌ అజహరుద్దీన్‌, నయాన్‌ మోంగియా, కపిల్‌ దేవ్‌, హర్భజన్‌ సింగ్‌, అనిల్‌ కుంబ్లే, జవగల్‌ శ్రీనాథ్‌.

Story first published: Wednesday, April 8, 2020, 9:39 [IST]
Other articles published on Apr 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+