హైదరాబాద్: ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన దిగ్గజం షేన్ వార్న్ నిత్యం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండటాన్ని మనం చూశాం. తాజాగా షేన్ వార్న్ ట్విట్టర్‌లో ఓ చిన్నారికి బౌలింగ్ పాఠాలు చెప్పాడు. అసలేం జరిగిందంటే..
ఎనిమిదేళ్ల చిన్నారికి షేన్ వార్న్‌తో పాటు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. బౌలింగ్‌లో రాణించేందుకు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించి తీసిన వీడియోను ఆ చిన్నారి తండ్రి ట్విటర్ ద్వారా వార్న్‌కి ట్యాగ్ చేస్తూ 'నిన్ను అమితంగా ఇష్టపడతాడు. నా ఎనిమిదేళ్ల కుమారుడికి ఏవైన టిప్స్ ఇవ్వు' అని పోస్టు చేశాడు.
ఈ వీడియో ట్వీట్‌ని వీక్షించిన షేన్ వార్న్ ట్విట్టర్‌లోనే ఆ చిన్నారికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. స్ట్రయిట్‌గా వచ్చి బంతిని విసరాలని సూచించాడు. కాగా, ఆసీస్ తరుపున 145 టెస్టులు, 194 వన్డేలు, 73 టీ20లు ఆడిన వార్న్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు(708) తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీ ధరన్ 800 వికెట్లు తీసి అగ్ర స్ధానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత షేన్ వార్న్ పలు టోర్నీలకు కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.