Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shane Warne: షేన్ వార్న్ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మరణానికి కారణం ఇదేనా?

Shane Warne: ఆస్ట్రేలియా మాజీ లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ మార్చి 4, 2022న థాయిలాండ్‌లో మరణించారు. షేన్ వార్న మరణానికి కారణం గుండెపోటు అని పోస్టుమార్టం నివేదకలో చెప్పబడింది. అయితే ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ విషయంలో బ్రిటీష్ మీడియా ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. నివేదిక ప్రకారం.. మాజీ క్రికెటర్ మృతదేహం దొరికిన థాయిలాండ్ విల్లా నుంచి సెక్స్ డ్రగ్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ సమస్య చేయి దాటిపోకుండా ఉండటానికి పోలీసులు అధికారులు గదిని శోధించి గదిలో నుంచి సెక్స్ డ్రగ్ ను తొలగించారు.

డైలీ మెయిల్ నివేదికలో వెల్లడి
షేన్ వార్న్ మరణం తర్వాత అతని గదిని సోదా చేస్తున్నప్పుడు అక్కడ కామాగ్రా అనే సెక్స్ డ్రగ్ దొరికిందని, ఇది చాలా శక్తివంతమైనదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి డైలీ మెయిల్ తో అన్నారు. ఈ ఔషధం థాయిలాండ్ లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా లభిస్తుంది. భారతదేశంలో తయారు చేయబడుతుంది. షేన్ వార్న్ మరణానికి ఈ సెక్స్ డ్రగ్ కారణం కావచ్చునని పోలీసులు అధికారి నమ్ముతున్నారు. ఇది కాకుండా సెక్స్ డ్రగ్ ను తొలగించమని పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ఆ అధికారి వెల్లడించారు. అధికారికంగా అతని మరణానికి కారణం గుండె పోటుగా పరిగణించబడినప్పటికీ కారణం అది కాకపోవచ్చుననని తెలిపారు.

Shane Warne Death Case Shocking Twist Revealed in 2025

షేన్ వార్న్ క్రికెట్ కెరీర్
షేన్ వార్న్ 1992లో ఆస్ట్రేలియా తరఫున షేన్ వార్న్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్ లో షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టులు, 194 వన్డేలు, 55 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. టెస్ట్ క్రికెట్ లో బౌలింగ్ చేస్తూ వార్న్ 708 వికెట్లు పడగొట్టడం. టెస్ట్ క్రికెట్ లో షేన్ వార్న్ బెస్ట్ 71 పరుగులకు 8 వికెట్లు తీయడం. ఇది కాకుండా 194 వన్డే మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ అతను 203 వికెట్లు పడగొట్టాడు. వన్డేలో షేన్ వార్న్ బెస్ట్ 33 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో అతని పేరు మీద 57 వికెట్లు ఉన్నాయి. ఇది కాకుండా టెస్టులలో షేన్ వార్న్3154 పరుగులు చేశాడు. షేన్ వార్న్ బెస్ట్ స్కోర్ 99 పరుగులు. అతని బ్యాట్ నుంచి 12 అర్థ సెంచరీలు వచ్చాయి. వన్డేల్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వార్న్ 1018 పరుగులు చేశాడు. వన్డేల్లో షేన్ వార్న్ ఒక హాఫ్ సెంచరీ సాధించాడు.

Story first published: Tuesday, April 1, 2025, 16:33 [IST]
Other articles published on Apr 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+