చాలా హాట్‌గా ఉందట: ప్లేబాయ్ మోడల్‌తో వార్న్ డేటింగ్
సిడ్నీ: ప్లేబాయ్ మోడల్ ఎమిలీ స్కాట్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లు స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ప్రకటించాడు. గత నెలలో స్కాట్‌ను ముద్దాడుతూ షేన్ వార్న్ కెమెరాలకు దొరికిపోయాడు. ఇప్పుడు ట్విట్టర్‌లో తన ప్రేమ విషయం బయటపెట్టాడు.
ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ ఆట చూసేందుకు వింబుల్డన్ వెళ్తున్న సందర్భంగా మళ్లీ అక్కడ మీడియా తమ వెంట పడకుండా ఉండాలనో... ఏమో గానీ ఈ విషయాన్ని బయట పెట్టాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఎమిలీ స్కాట్‌తో కలిసి తిరుగుతున్నానని, ఆమె చాలా హాట్‌గా ఉందని చెప్పాడు.

ఇటీవలి కాలంలో వీరు ఇద్దరు కలిసి లండన్‌లో చాలా ఈవెంట్లకు వెళ్లారు. ఇద్దరు కలిసి ప్రేమికుల స్వర్గధామం అయిన ప్యారిస్‌కు కూడా వెళ్లారు. అక్కడ కొంతకాలం గడిపారు. ఆ విషయం షేన్ వార్న్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిసింది.
నెల రోజుల క్రితం వరకు ఎలిజబెత్ హార్లీతో తిరిగిన షేన్ వార్న్.. తాను స్కాట్‌తో కలిసి తిరుగుతున్న విషయాన్ని ఖండించాడు అప్పుడు. ఇప్పుటు మాత్రం దానిని అంగీకరించాడు. కాగా, ఎమిలీ స్కాట్ డీజేగా కూడా పని చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications