హైదరాబాద్: లండన్ నైట్‌క్లబ్‌లో తప్పతాగి అక్కడున్న పోర్న్‌స్టార్ వేలెరీ ఫాక్స్‌పై తాను చేయి చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆసీస్ మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించాడు.
'టీవీల్లో నామీద వస్తోన్న వార్తలు చూసి షాక్‌కు గురయ్యాను. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఫాక్స్ కేసు పెట్టడంతో పోలీసులు నన్ను విచారించారు. నేను వారికి పూర్తి స్థాయిలో సహకరించాను. అనంతరం వారు సీసీటీవీ ఫుటేజీ వీక్షించారు. స్థానికులతో మాట్లాడారు. అంతిమంగా ఫాక్స్ చేసిన ఆరోపణల్లో, ఫిర్యాదులో ఏమాత్రం నిజం లేదని నిర్ధరించారు. దీంతో వారు నాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి ఇక్కడితో ఈ వార్తలకు తెరదించండి' అని వార్న్ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
అసలే జరిగింది?
లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్‌లోని హెర్ట్‌ఫోర్డ్ స్ట్రీట్‌లో ఉన్న నైట్‌క్లబ్‌లో శుక్రవారం రాత్రి షేన్ వార్న్ తనను కొట్టాడని పోర్న్‌స్టార్ వేలెరీ ఫాక్స్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఓ మహిళపై చేయి చేసుకొని గర్వంగా ఫీలవుతున్నావా? అంటూ ఆమె తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నువ్వు ఎంత ఫేమస్ అయితే మాత్రం ఓ మహిళను కొట్టి తప్పించుకుందామనుకుంటున్నావా? అంటూ ఫాక్స్ మరో ట్వీట్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు విచారణ జరిపారు.
విచారణ అనంతరం వార్న్ తన ట్విట్టర్‌లో ఈఘటనపై పైవిధంగా స్పందించాడు. 2000 ఏడాదిలోనూ ఓ బ్రిటిష్ నర్సుకు అసభ్య మెసేజ్‌లు పంపించి వైస్ కెప్టెన్సీ పదవిని వార్న్ కోల్పోయిన సంగతి తెలిసిందే. 2005లో ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ వార్న్ భార్య సిమోన్ అతనికి విడాకులిచ్చింది.