Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడతడి బౌలింగ్‌కు షేన్ వార్న్ క్లీన్ బౌల్డ్: ఓటేసి గెలిపించాలంటూ పిలుపు

Shane Warne Blown Away by 7-year-old Spin Bowling Sensation Eli Mikal Khan

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్‌ను 7 ఏళ్ల బుడతడు తన స్పిన్ బౌలింగ్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో చిన్నారి బౌలింగ్‌ను మెచ్చిన షేన్ వార్న్ నేరుగా అతడితో మాట్లాడాడు. అంతేకాదు అతడి గురించి షేన్ వార్న్ తన ట్విట్టర్‌లో కూడా పోస్టు చేశాడు. లారెస్ స్పోర్టింగ్ మూమెంట్‌లో భాగంగా ఈ యువ బౌలర్‌కు ఓటేయాలని వార్న్ కూడా పిలుపునిచ్చాడు.

ఆ చిన్నారి పేరు ఎలి మికల్ ఖాన్. పాకిస్థాన్‌కు చెందిన ఏడేళ్ల బుడతడు షేన్ వార్న్‌తో మాట్లాడిన సందర్భంలో ఆనందం తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు. అంతేకాదు తనను అందరూ లిటిల్ షేన్ వార్న్ అని పిలవడం ఓ అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు అతను చెప్పాడు. తాను భవిష్యత్తులో మరో షేన్ వార్న్ కావాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

Shane Warne Blown Away by 7-year-old Spin Bowling Sensation Eli Mikal Khan

ఏదో ఒక రోజు పాకిస్థాన్ జాతీయ జట్టుకు ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. సోషల్ మీడియాలో ఆ చిన్నారి లెగ్ స్పిన్ వీడియో చూసి ఆశ్చర్యానికి గురైన వార్న్.. వెంటనే అతనితో మాట్లాడాడు. ఏడేళ్ల వయసులోనే ఇలా బౌలింగ్ చేయడం అద్భుతమని షేన్ వార్న్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు.

లారెస్ అనే సంస్ధ అభిమానుల ఫేవరెట్ స్పోర్టింగ్ మూమెంట్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా నాలుగు వీడియోలు పోస్ట్ చేసి వాటిలో నచ్చిన వాటికి ఓటు వేయాల్సిందిగా కోరింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ కాంటెస్ట్ కొనసాగనుంది. ప్రతి నెలా పది మంది విన్నర్లను ఎంపిక చేయనున్నారు.

వీరంతా చివర్లో 'స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ద ఇయర్' కోసం పోటీ పడతారు. ఆ తర్వాత 2019లో జరిగే లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల్లో విజేత ఎవరో ప్రకటిస్తారు.

Story first published: Wednesday, July 4, 2018, 17:05 [IST]
Other articles published on Jul 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+