హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్‌పై కేసు నమోదైంది. లండన్ నైట్‌క్లబ్‌లో తప్పతాగి అక్కడున్న పోర్న్‌స్టార్ వేలెరీ ఫాక్స్‌పై షేన్ వార్న్ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ముఖంపై కొట్టడం కన్ను వాచిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఓ మహిళపై చేయి చేసుకొని గర్వంగా ఫీలవుతున్నావా? అంటూ ఆమె తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వార్న్ కొట్టగానే ఫాక్స్ కింద పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నువ్వు ఎంత ఫేమస్ అయితే మాత్రం ఓ మహిళను కొట్టి తప్పించుకుందామనుకుంటున్నావా? అంటూ ఫాక్స్ మరో ట్వీట్ చేసింది. వెస్ట్‌మిన్‌స్టర్‌లోని హెర్ట్‌ఫోర్డ్ స్ట్రీట్‌లో ఉన్న నైట్‌క్లబ్‌లో జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తెలిపారు.
2000 ఏడాదిలోనూ ఓ బ్రిటిష్ నర్సుకు అసభ్య మెసేజ్‌లు పంపించి వైస్ కెప్టెన్సీ పదవిని వార్న్ కోల్పోయిన సంగతి తెలిసిందే. 2005లో ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ వార్న్ భార్య సిమోన్ అతనికి విడాకులిచ్చింది.