Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భువీ..ప‌రిస్థితేంటీ? త‌లుపులు మూసుకుపోయిన‌ట్టేనా?

ICC Cricket World Cup 2019 : Shami Shuts The Door On Bhuvi's Comeback || Oneindia Telugu
 Shami shuts the door on Bhuvis comeback

లండన్‌: భార‌త క్రికెట్ జ‌ట్టులో పునః ప్ర‌వేశం చేయ‌డానికి ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు నిరాశ త‌ప్ప‌దా? ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో మిగిలిన మ్యాచుల్లో ఇక ఈ స్పీడ్‌స్ట‌ర్ ఆడే అవ‌కాశాల‌ను కోల్పోయాడా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. ఇన్నాళ్లూ కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డం వ‌ల్ల మ్యాచ్‌లకు దూర‌మైన భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు తాజాగా మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ రూపంలో గండం ఎదురైంది. భువ‌నేశ్వ‌ర్ గైర్హాజ‌రీలో త‌న‌ను తాను నిరూపించేసుకున్నాడు ష‌మీ.

భువ‌నేశ్వ‌ర్ కుమార్ కార‌ణంగా పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో తుది జ‌ట్టులో స్థానాన్ని ద‌క్కించుకోలేక‌పోయాడు. ఆ త‌రువాత టీమిండియా ఎదుర్కొన్న రెండు మ్యాచుల్లోనూ అద్భుతంగా రాణించాడు. బంతితో మేజిక్ సృష్టించాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ష‌మీని ప‌క్క‌న పెట్టే సాహ‌సానికి టీమిండియా మేనేజ్‌మెంట్ దిగ‌క‌పోవ‌చ్చు.

రెండు మ్యాచుల్లో వ‌రుస వికెట్లు

రెండు మ్యాచుల్లో వ‌రుస వికెట్లు

ఈ నెల 16వ తేదీన మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా భువ‌నేశ్వ‌ర్ కుమార్ గాయ‌ప‌డ్డాడు. కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అర్ధాంత‌రంగా మ్యాచ్ నుంచి త‌ప్పుకొన్నాడు. ఆ మ్యాచ్ త‌రువాత టీమిండియా ఆఫ్ఘ‌నిస్తాన్‌, వెస్టిండీస్‌ల‌ను ఎదుర్కొంది. భువ‌నేశ్వ‌ర్ కుమార్ స్థానాన్ని మ‌హ‌మ్మ‌ద్ ష‌మీతో భ‌ర్తీ చేశారు. అనుకోకుండా ల‌భించిన ఈ అవ‌కాశాన్ని జార‌విడుచుకోలేదు ష‌మీ. రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. రెండు మ్యాచుల్లోనూ రాణించాడు. సౌతాంప్ట‌న్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తోన్న ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టుపై హ్యాట్రిక్ తీసుకుని న‌డ్డి విరిచాడు. తాజాగా ఓల్డ్ ట్రాఫొర్డ్ మ్యాచ్‌లో సైతం వెస్టిండీస్ బ్యాటింగ్ లైన‌ప్‌ను క‌కావిక‌లం చేశాడు. 16 ప‌రుగుల‌కు నాలుగు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో వెస్టిండీస్‌పై అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ను న‌మోదు చేసుకున్నాడు.

ఇంగ్లండ్‌పైనా ష‌మీనే..

ఇంగ్లండ్‌పైనా ష‌మీనే..

అనూహ్యంగా రాణిస్తోన్న మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని ప‌క్క‌న పెట్టి, ఫిట్‌నెస్ సాధించిన భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను తుది జ‌ట్టులో తీసుకునే సాహ‌సానికి టీమ్ మేనేజ్‌మెంట్ దిగ‌క‌పోవ‌చ్చు. పేరు పెట్ట‌డానికి వీలులేని బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌. అందులో సందేహాలు అన‌వ‌స‌రం. అదే స‌మ‌యంలో- అత్యుత్త‌మంగా రాణిస్తోన్న ష‌మీని ప‌క్క‌న పెట్టి భువనేశ్వ‌ర్ కుమార్‌కు తుది జ‌ట్టులో చోటు క‌ల్పిస్తారా అనేది అనుమాన‌మే. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో టీమిండియాకు ఇంకా సెమీ ఫైన‌ల్ బెర్త్ ల‌భించ‌లేదు. ఇంకో మ్యాచ్ గెల‌వాల్సి ఉంది. ఇలాంట‌ప్పుడు- స‌మ‌వుజ్జీగా ఉన్న ఇంగ్లండ్‌ను ఢీ కొట్ట‌డానికి ఫామ్‌లో ఉన్న ష‌మీని కాద‌ని భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను తీసుకోక‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో- భువ‌నేశ్వ‌ర్ కుమార్ టీమిండియాలోకి క‌మ్ బ్యాక్ కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలే అధికంగా క‌నిపిస్తున్నాయి.

స్పెష‌లిస్ట్ బౌల‌ర్‌తో దిగితే త‌ప్ప‌..

స్పెష‌లిస్ట్ బౌల‌ర్‌తో దిగితే త‌ప్ప‌..

ప్ర‌స్తుతం టీమిండియా అయిదుగురు బౌల‌ర్ల‌తో మ్యాచుల‌ను ఆడుతోంది. ష‌మీ లేదా భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఉన్నారు. కుల్‌దీప్ యాద‌వ్‌, చాహ‌ల్ స్పిన్ బౌలింగ్‌ను న‌డిపిస్తున్నారు. పార్ట్ స్పిన్న‌ర్‌గా కేదార్ జాద‌వ్‌, ఆల్ రౌండ‌ర్‌గా విజ‌య్ శంక‌ర్ ఉన్నారు. కేదార్ జాద‌వ్‌, విజ‌య్ శంక‌ర్ ఇద్ద‌రూ అయిదో బౌల‌ర్ పాత్ర‌ను పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ష‌మీ రాణిస్తోన్న నేప‌థ్యంలో ఏ ఒక్క‌ర్నయినా తొల‌గించి, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు చోటు క‌ల్పించే అవ‌కాశం ప్ర‌స్తుతానికి క‌నిపించ‌ట్లేదు.

క‌మ్ బ్యాక్‌లో జాప్యం..

క‌మ్ బ్యాక్‌లో జాప్యం..

కేదార్ జాద‌వ్‌, విజ‌య్ శంక‌ర్ ఆల్‌రౌండ‌ర్లు. వారిద్ద‌రూ అటు బ్యాట్‌తో ఇటు బంతితో రాణించ‌గ‌ల‌రు. విజ‌య్ శంక‌ర్‌ను ఆడించ‌కూడ‌ద‌నుకుంటే ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఎలాగూ ఉండ‌నే ఉన్నాడు. వారంద‌ర్నీ కాద‌ని బౌలింగ్ విభాగాన్ని బ‌లోపేతం చేయ‌డానికి భువిని తీసుకుంటార‌ని ఎవ‌రూ అనుకోరు. ఈ ప‌రిస్థితుల్లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు దారులు మూసుకుపోయిన‌ట్టేన‌ని అంటున్నారు. అత‌ను టీమిండియాలోకి పున్ఃప్ర‌వేశించ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టొచ్చ‌నేది క్రికెట్ పండితుల అంచ‌నా.

Story first published: Friday, June 28, 2019, 13:23 [IST]
Other articles published on Jun 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+