
హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తం 4 వికెట్లు తీసిన షమీ, విదేశీ గడ్డపై 50కిపైగా వికెట్లు తీసిన భారత 14వ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
India vs South Africa 2018 1st Test Score Card
కేప్‌టౌన్ టెస్టులో నాలుగోరోజైన సోమవారం దక్షిణాఫ్రికా నైట్ వాచ్‌మెన్ రబాడని 5 పరుగుల వద్ద ఔట్ చేయడంతో షమీ ఈ ఘనత అందుకున్నాడు. విదేశీ గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే 200 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
కపిల్ దేవ్ (155), జహీర్ ఖాన్ (147), బిషన్‌సింగ్ బేడి (123), హర్భజన్ సింగ్ (117), జవగళ్ శ్రీనాథ్ (117), ఇషాంత్ శర్మ (110), చంద్రశేఖర్ (92), రవిశాస్త్రి (65), వెంకట రాఘవన్ (62), బీకేవీ ప్రసాద్ (55), శ్రీశాంత్ (54) తర్వాత స్థానాల్లో ఉన్నారు.
కోల్‌కతాకు చెందిన మహమ్మద్ షమీ గత కొన్ని సంవత్సరాలుగా భారత పేసర్ల విభాగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా కోహ్లీసేనకు 208 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.