Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS PAK Shami: పాకిస్థాన్‌తో మ్యాచ్.. 9 కేజీల బరువు తగ్గిన మహ్మద్ షమీ!

ఐసీసీ ట్రోఫీలు అంటే చెలరేగిపోతుంటాడు టీమిండియా సీనియర్‌ పేసర్ మహ్మద్ షమీ. రీసెంట్ గానే బంగ్లాదేశ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేసి అదరగొట్టాడు. తద్వారా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డును సాధించాడు. అయితే తాజాగా పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ కు ముందు తన ఫిట్ నెస్ గురించి మాట్లాడాడు షమీ. '90 కేజీల ఉన్న శరీర బరువును తగ్గించుకోవడానికి మీరేం చేశారని'.. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.

బిర్యానీ వల్ల తగ్గారా?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఫిట్ నెస్ సాధించడంలో భాగంగా తాను 9 కేజీల బరువు తగ్గినట్టుల పేర్కొన్నాడు మహ్మద్ షమీ.'నాకు తెలిసి రెండే కష్టమైన విషయాలు. ఒకటి అప్పు తీర్చడం, ఇంకొకటి బరువు తగ్గడం. అప్పు తీర్చాలంటే మెదడు కావాలి. మీరు 4 నుంచి 5 కేజీలు తగ్గారు. బరువు తగ్గడానికి మీరేం చేశారు?' అని సిద్ధూ అడగగా.. " నేను 9 కేజీలు బరువు తగ్గాను." అని నవ్వుతూ షమీ సమాధానం ఇచ్చాడు. దానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ నవ్వుతూ.. 'బరువు తగ్గడానికి బిర్యానీ సరైన మార్గమా' అని నవ్వుతూ మరోసారి ప్రశ్నించాడు.

Shami fitness talks about his 9kg Weight Loss Secret ahead of ind vs pak champions trophy

మనసుకు దగ్గర తీసుకుని చేస్తే..
"ఒక విషయాన్ని లేదా పనిని మనసుకు తీసుకుని చేస్తే, అది సులువు అవుతుంది. నేను NCAలో ఉన్నప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అప్పుడు నా బరువు 90 కేజీల వరకు పెరిగిపోయింది. ముఖ్యంగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నా నాలుక. దీన్ని డీల్ చేయడం చాలా కష్టం. అయితే నేను స్వీట్లకు దూరంగా ఉన్నాను. నేను తినకూడని చాలా ఆహార పదార్ధాలకు దూరంగా ఉన్నాను." అని షమీ అన్నాడు.

అప్పటి నుంచి ఒంటిపూట భోజనం..
"బిర్యానీ విషయానికొస్తే.. అది నాకు చిల్ మిల్ రన్స్. కొన్నిసార్లు అదే నా కోసం పరిగెడుతుంది. అయినా నేను 2015 నుంచి రోజుకు ఒక పూట మాత్రమే తినడం ప్రారంభించాను. బ్రేక్ ఫాస్ట్,లంచ్ ఏమీ చేయను. కేవలం డిన్నర్ మాత్రమే చేస్తాను. ఇది చాలా కష్టం. కానీ ఒక్కసారి దీన్నిపాటించడం ప్రారంభిస్తే, అవన్నీ సులభంగానే అనిపిస్తాయి." అని షమీ పేర్కొన్నాడు.

Story first published: Saturday, February 22, 2025, 13:30 [IST]
Other articles published on Feb 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+