Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌స్టర్‌కు బంపర్ ఆఫర్ - రాత్రికి రాత్రి మారిన ఈక్వేషన్స్..!!

Shami doubtful for South Africa series, BCCI reportedly ask Umran Malik to stay on standby

ముంబై: భారత క్రికెట్ జట్టు.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఈ సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమవుజ్జీగా నిలిచాయి. ఇవ్వాళ హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరుగనుంది. సిరీస్ ఎవరి సొంతమౌతుందో డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి రెండు జట్లు నెట్స్‌లో చెమటోడుస్తోన్నాయి. ఉప్పల్ స్టేడియం ట్రాక్ రికార్డ్.. టీమిండియాకు అనుకూలంగా ఉండటం కలిసొచ్చే అంశం.

దక్షిణాఫ్రికాతో..

దక్షిణాఫ్రికాతో..

దీని తరువాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడబోతోంది టీమిండియా. దీనికోసం జట్టు కూడా ఇదివరకే ఎంపికైంది. తొలి మ్యాచ్ ఈ నెల 28వ తేదీన నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం దీనికి ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 2వ తేదీన రెండో మ్యాచ్ అస్సాం గౌహతిలోని భూపేన్ హజారికా బార్సపారాలో, 4వ తేదీన మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగనున్నాయి.

షమీపై డౌట్స్..

షమీపై డౌట్స్..

దీని తరువాత టీ20 ప్రపంచకప్‌ ఆడుతుంది భారత జట్టు. ఈ మెగా ఈవెంట్ కోసం ఆస్ట్రేలియాకు తరలి వెళ్తుంది. ఈ పరిణామాల మధ్య టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉదంతం కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా వైరస్ బారిన పడటం వల్ల అతను జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరం అయ్యాడు. మరో మూడు రోజుల్లో ఆరంభం కాబోయే దక్షిణాఫ్రికాతో సిరీస్‌కూ ఆడేది అనుమానమే.

ఫిట్‌నెస్‌పై..

ఫిట్‌నెస్‌పై..

మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి దీనికి సంబంధించిన వివరాలను తెప్పించుకుంటోన్నామని పేర్కొంటోన్నాయి. మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు షమీ ఫిట్‌నెస్‌పై ఆరా తీస్తోందని, అంతా సజావుగానే సాగుతుందని భావిస్తున్నామని స్పష్టం చేస్తోన్నాయి. వందశాతం ఫిట్‌నెస్‌ను సాధిస్తేనే జట్టులో చోటు దక్కుతుందని వెల్లడించాయి.

షమీ స్థానంలో..

షమీ స్థానంలో..

షమీ అందుబాటులో లేని పరిస్థితుల్లో అతని స్థానాన్ని బీసీసీఐ సెలెక్టర్లు మరో ఫాస్ట్ బౌలర్‌తో భర్తీ చేయడం ఖాయం. దీనికోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ పేరును పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతనికి ఇదివరకే సమాచారం పంపించినట్లు చెబుతున్నారు. అందుబాటులో ఉండాలంటూ బీసీసీఐ వర్గాల నుంచి మాలిక్‌కు సంకేతాలు వెళ్లిందని అంటున్నారు. అదే జరిగితే- మళ్లీ అతను జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినట్టవుతుంది.

Story first published: Sunday, September 25, 2022, 13:32 [IST]
Other articles published on Sep 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+