చార్జ్‌షీట్ నమోదు: వరల్డ్‌కప్ ముందు మహ్మద్ షమీకి ఎదురుదెబ్బ

హైదరాబాద్: కీలకమైన వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి ఎదురుదెబ్బ. గతేడాది ఐపీఎల్‌కు ముందు షమీపై లైంగిక ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్ జహాన్ తాజాగా వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో షమిపై సెక్షన్ 498 ఏ కింద వరకట్న వేధింపులు, సెక్షన్ 354 ఏ కింద లైంగిక వేధింపుల కేసు కింద పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
ప్రపంచకప్, ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్న షమీపై ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. చార్జిషీట్‌లో షమితో పాటు అతని సోదరుడు హసిబ్ అహ్మద్ పేరును కూడా చేర్చారు. నాన్‌బెయిలబుల్ నేరాలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోల్‌కతా మహిళా గ్రీవెన్ సెల్ పోలీసులు గురువారం అలీపోర్ ఏసీజేఎమ్ కోర్టులో దాఖలు చేశారు. దీంతో షమీ వరల్డ్‌కప్‌లో ఆడడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

తల్లిదండ్రులు, మరదలి పేరు తొలగింపు
అయితే గతంలో నమోదు చేసిన 307 (హత్యాయత్నం), 376 (లైంగిక దోపిడికి శిక్ష) వంటి నేరపూరిత కఠినమైన సెక్షన్లను పోలీసులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ కేసులో షమీకి కాస్త ఊరట లభించింది. అలాగే తల్లిదండ్రులు, మరదలి పేరును కూడా ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించారు.

తల్లిదండ్రులు, మరదలి పేరును
తన భర్తకు మరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడనే సంచలన ఆరోపణలతో హసీన్ జహాన్ అతడిని ఉక్కిరి బిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. చివరకు షమీపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది.

తనకు.. తన కూతురు పోషణ ఖర్చులకు డబ్బులు
కొన్ని స్క్రీన్ షాట్లను షమీ భార్య హసీన్ జహాన్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు.. తన కూతురు పోషణ ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ కోర్టును కూడా ఆశ్రయించింది.

నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం
దీనికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకముందు హసీన్ ఆరోపణల నేపథ్యంలో షమి సెంట్రల్ కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపేసిన బీసీసీఐ.. అతనిపై విచారణకు ఆదేశించింది. విచారణలో షమిపై ఫిక్సింగ్ ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో మళ్లీ కాంట్రాక్టును పునరుద్ధరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications