షమీ, యాదవ్ అదుర్స్: విండీస్‌కు తప్పని ఫాలోఆన్
అంటిగ్వా: వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడి కరీబియన్ల వెన్ను విరిచాడు. భారత్ పేసర్లు మహ్మమద్ షమీ(4/66), ఉమేష్ యాదవ్(4/41) విజృంభించిన వేళ వెస్టిండీస్ 243 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో తొలి టెస్ట్‌లో భారత్ పట్టుబిగించింది.
ఫాలోఆన్‌కు దిగిన విండీస్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి 21/1తో నిలిచింది. భారత్‌కు లక్ష్యం నిర్దేశించాలంటే విండీస్ మరో 302 పరుగులు పైన సాధించాల్సి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 31/1తో మూడోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు భారత బౌలర్ షమి, ఉమేశ్ యాదవ్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరూ విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు అమిత్ మిశ్రా (2/43) రాణించాడు.
మూడో రోజు విండీస్‌ను దెబ్బతీయడంలో పేసర్ షమిదే కీలక పాత్ర. అదనపు బౌన్స్‌తో అతడు అత్యంత ప్రభావవంతంగా బౌలింగ్ చేశాడు. నిజానికి ఉదయం నిర్జీవమైన పిచ్‌పై విండీస్ ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్, నైట్‌వాచ్‌మన్ బిషూ (12) భారత బౌలర్లను 16 ఓవర్లపాటు తీవ్ర అసహనానికి గురి చేశారు. ముఖ్యంగా బ్రాత్వైట్ తీవ్రంగా ప్రతిఘటించాడు.
తొలి సెషన్లో అతడు 91 బంతులు ఎదుర్కోగా.. విండీస్ 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐతే తమ భాగస్వామ్యంలో బ్రాత్వైట్, బిషూ ఇబ్బందులు ఎదుర్కోక పోలేదు. బంతి చాలాసార్లు బిషూ బ్యాటు అంచును తాకి వెళ్లింది. తొలి ఎనిమిది ఓవర్లలో అతడు కేవలం 15 బంతులే ఎదుర్కొన్నాడు. పేసర్లు ఒత్తిడి తెచ్చినా.. దాన్ని స్థిరంగా కొనసాగించలేకపోయారు.
అయితే షమి నిలకడగా ఆఫ్‌స్టంప్ ఆవల బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించాడు. చివరికి బిషూను ఔట్ చేయడం ద్వారా మిశ్రా రెండో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఎటాకింగ్ బౌలింగ్‌ను కొనసాగించిన షమి.. డారెన్ బ్రావో (11)ను త్వరగానే వెనక్కి పంపాడు. షమి.. కీపర్ క్యాచ్ ద్వారా బ్రావోను వెనక్కి పంపడంతో లంచ్ సమయానికి విండీస్ 90/3తో నిలిచింది. లంచ్ తర్వాత దూకుడు కొనసాగించిన షమి.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు.
విరామం తర్వాత తన మూడో ఓవర్లో అతడు శామ్యూల్స్ (1), బ్లాక్‌వుడ్ (0)లను పెవిలియన్ బాట పట్టించాడు. ఆఫ్‌స్టంప్ లోగిలిలో షమి బంతిని ఆడబోయిన శామ్యూల్స్.. సాహా చేతికి చిక్కాడు. టెస్టుల్లో షమికి ఇది 50వ వికెట్. రహానె అందుకున్న చక్కని క్యాచ్‌కు బ్లాక్‌వుడ్ నిష్క్రమించాడు.
92/5తో విండీస్ చిక్కుల్లో పడింది. ఐతే మొండిగా పాతుకుపోయిన క్రెయిగ్ బ్రాత్వైట్ మాత్రం పోరాటాన్ని కొనసాగించాడు. చేజ్ (23) కూడా ప్రతిఘటించడంతో ఓ దశలో విండీస్ 139/5తో నిలిచింది. ఐతే ఉమేశ్ వరుస ఓవర్లలో చేజ్, బ్రాత్వైట్‌లను ఔట్ చేసి విండీస్‌ను గట్టి దెబ్బతీశాడు. హోల్డర్, బ్రాత్‌వైట్, గాబ్రియల్ వరుసగా వెనుదిరగడంతో వెస్టిండీస్ 243 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఫొలోఆన్‌లోనూ విండీస్‌కు ఆరంభ కష్టాలు
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఇషాంత్ శర్మ రూపంలో తొలి దెబ్బ తగిలింది. తొలి ఓవర్లలోనే బ్రాత్‌వైట్ (2) వికెట్ కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సరికి విండీస్ 21/3తో నిలిచింది. రాజేంద్ర చంద్రిక(9), బ్రావో(10) క్రీజులో ఉన్నారు.

షమీ, యాదవ్ అదుర్స్
వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపాడు.

షమీ, యాదవ్ అదుర్స్
నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడి కరీబియన్ల వెన్ను విరిచాడు. భారత్ పేసర్లు మహ్మమద్ షమీ(4/66), ఉమేష్ యాదవ్(4/41) విజృంభించిన వేళ వెస్టిండీస్ 243 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో తొలి టెస్ట్‌లో భారత్ పట్టుబిగించింది.

షమీ, యాదవ్ అదుర్స్
ఫాలోఆన్‌కు దిగిన విండీస్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి 21/1తో నిలిచింది. భారత్‌కు లక్ష్యం నిర్దేశించాలంటే విండీస్ మరో 302 పరుగులు పైన సాధించాల్సి ఉంది.

షమీ, యాదవ్ అదుర్స్
ఓవర్‌నైట్ స్కోరు 31/1తో మూడోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు భారత బౌలర్ షమి, ఉమేశ్ యాదవ్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరూ విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు అమిత్ మిశ్రా (2/43) రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications