షేంఫుల్: విరాట్ కోహ్లీ లక్ష్యంగా ఆసీస్ మీడియా (ఫోటోలు)
హైదరాబాద్: బెంగుళూరు టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన డీఆర్ఎస్ రివ్యూ వివాదాన్ని ఆస్ట్రేలియా మీడియా మాత్రం మరిచిపోవడం లేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని జంతువులతో పోల్చుతూ విమర్శలకు దిగింది.
ఆటపై దృష్టి పెట్టాలని బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా డీఆర్ఎస్ వివాదానికి ముగింపు పలికిన ఆసిస్ మీడియా మాత్రం ఇరు జట్ల మధ్య అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా కెప్టెన్ కోహ్లీ, పిల్లి, కుక్కపిల్ల, పాండా జంతువల ఫోటోతో వెటెల్ ఆఫ్ ది వీక్ అని పోస్ట్ చేసింది.
దీనికి క్యాప్షన్ 'ఇటీవల జరిగిన పరిణామాలు మన వెటెల్ ఆఫ్ ది వీక్ అవార్డుకు ప్రేరేపించే విధంగా ఉన్నాయి. పిల్లలు మీ తాతయ్యలను అడగండి. మిగిలిన విషయాలు మీకు తెలుసు' అని ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేసింది.
విరాట్ కోహ్లీ పట్ల ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా ఈ విధంగా జాత్యాంకార దాడికి దిగడంపై సోషల్ మీడియాలో భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఆసీస్ మీడియా టార్గెట్ కోహ్లీ
కెప్టెన్ కోహ్లీ, పిల్లి, కుక్కపిల్ల, పాండా జంతువల ఫోటోతో వెటెల్ ఆఫ్ ది వీక్ అని పోస్ట్ చేసింది. దీనికి క్యాప్షన్ 'ఇటీవల జరిగిన పరిణామాలు మన వెటెల్ ఆఫ్ ది వీక్ అవార్డుకు ప్రేరేపించే విధంగా ఉన్నాయి. పిల్లలు మీ తాతయ్యలను అడగండి. మిగిలిన విషయాలు మీకు తెలుసు' అని ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేసింది.

మండిపడ్డ భారత క్రికెట్ అభిమానులు
కోహ్లీని జంతువుతో పోల్చుతూ ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా పెట్టిన ఫేస్ బుక్ పోస్టుపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఫాక్స్ స్పోర్ట్స్ పోల్‌పై ప్యాన్స్
టీమిండియా కెప్టెన్ కోహ్లీపై ఫాక్స్ స్పోర్ట్స్ పెట్టిన పోల్‌పై భారత క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదొక పనికిమాలిన పోల్ అంటూ ధ్వజమెత్తారు.

ఫాక్స్ స్పోర్ట్స్‌పై కోహ్లీ అభిమాని
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా మీడియా బాగా ప్రాచుర్యం కల్పిస్తుందంటూ ఓ అభిమాని ఆ పోల్‌కు స్పందించాడు. బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్‌ను 'డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ'గా మార్చాడంటూ కోహ్లీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications