అందుకే రషీద్ ఖాన్‌తో సూపర్ ఓవర్ వేయించా: విలియమ్సన్

వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

సూపర్ ఓవర్‌లో ముంబై విజయం:
సూపర్ ఓవర్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ కేవలం మూడు బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

పాండేపై ఎక్కువ భారం పడింది:
మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ... 'నాకు కొన్ని సూపర్ ఓవర్ల అనుభవం ఉంది. అయితే ఇపుడు మ్యాచ్ ముగించలేకపోయాం. మనీశ్‌పాండే అద్భుతంగా ఆడాడు. నబీతో కలిసి దాదాపు విజయ తీరాలకు చేర్చాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పాండేపై ఎక్కువ భారం పడింది. మొదటి పది ఓవర్లు మ్యాచ్ మావైపే ఉందనిపించింది. మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు' అని విలియమ్సన్ తెలిపారు.

రషీద్ ప్రపంచస్థాయి స్పిన్నర్:
'సూపర్ ఓవర్‌లో మేం ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. కానీ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాం. చిన్న లక్ష్యం కాబట్టి రషీద్ ఖాన్‌ను బౌలింగ్ చేయించాలనుకున్నా. ఎందుకంటే అతను ప్రపంచస్థాయి స్పిన్నర్. రషీద్ సూపర్ ఓవర్ బాగా వేయగలడని నమ్మి బౌలింగ్ ఇచ్చా. ఈ ఓటమితో ఈ రోజు చాలా నిరాశ చెందా. మాకు ఇంకా ఒక మ్యాచ్ ఉంది, తప్పకుండా గెలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తాం' అని విలియమ్సన్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications