అది ఔట్‌గా అపీల్ చేయడం సిగ్గుచేటు: రుతురాజ్ (Video)
టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రంజీట్రోఫీలో అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయంపై మండిపడ్డాడు. అంతేగాక ప్రత్యర్థి జట్టును తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా కఠిన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగిందంటే.. రంజీ ట్రోఫీలో గ్రూప్-ఏలో భాగంగా పుణె వేదికగా మహారాష్ట్ర వర్సెస్ సర్వీసెస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-ఏ జట్టుకు సారథి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతని స్థానంలో స్టాండ్‌బై కెప్టెన్‌గా అంకిత్ బవానె జట్టును నడిపిస్తున్నాడు. అయితే అంకిత్ ఔటైన తీరు చర్చనీయాంశంగా మారింది. అమిత్ శుక్లా బౌలింగ్‌లో అంకిత్ షాట్‌కు యత్నించాడు. అది సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో సెకండ్ స్లిప్‌వైపునకు దూసుకెళ్లింది. అక్కడ ఉన్న శుభమ్ రొహిల్లా క్యాచ్ అందుకున్నాడు.

అయితే శుభమ్ రొహిల్లాకు క్యాచ్ అందుకునే ముందే బంతిని నేలకు తాకినట్లుగా స్పష్టంగా కనిపించింది. కానీ సర్వీసెస్ జట్టు క్యాచ్ ఔట్‌గా అపీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీని సంప్రదించారు. అయితే అంతిమంగా అంపైర్లు ఔట్ అని ప్రకటించారు. అంపైర్ నిర్ణయం వ్యాఖ్యాతలను సైతం ఆశ్చర్యపరిచింది. బంతి నేలకు తాకిని తర్వాత ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లిందని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అంకిత్ ఔట్‌కు సంబంధించిన ఫొటోను రుతురాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పోస్ట్ చేశాడు.
దానికి 'అది ఔట్‌గా ఎలా ఇస్తారు? ఆ క్యాచ్‌ను అపీల్ చేయడం కూడా సిగ్గుచేటు. ఇది అత్యంత దారుణం' అని రుతురాజ్ రాసుకొచ్చాడు. కాగా, అంకిత్ వికెట్ మహారాష్ట్రకు ఎంతో కీలకమైనది. అతను సాధించిన 73 పరుగులే జట్టులో టాప్ స్కోరర్. అతని పోరాటంతోనే మహారాష్ట్ర 185 పరుగులు చేసింది. అయితే అంపైర్ పొరపాటు నిర్ణయం మహారాష్ట్రకు ప్రతికూలంగా మారింది. చివరి నాలుగు వికెట్లకు 21 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. సర్వీసెస్ బౌలర్లలో అమిత్ శుక్లా ఏడు వికెట్లు తీశాడు. కాగా, అంతకుముందు బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులు చేసింది.
Ruturaj Gaikwad was fuming with Ankit Bawne's controversial dismissal against Services #RanjiTrophy2024
— Vijeet Rathi (@vijeet_rathi) November 7, 2024
Source: Gaikwad's Instagram story pic.twitter.com/HParORg3YQ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications