‘Shame on PCB’: ఫ్లడ్‌లైట్లు వెలిగించేందుకు డబ్బులు లేవుగానీ మీకు కశ్మీర్ కావాలా?

హైదరాబాద్: సెప్టెంబర్ 30, 2019. పాకిస్థాన్ చరిత్రలో మరిచిపోలేని రోజు. ఎందుకంటే పదేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ మళ్లీ ఆ గడ్డపై జరిగింది. ద్వైపాక్షిక సిరిస్‌లో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభ్యర్దనను అంగీకరించి శ్రీలంక జట్టు పాక్‌లో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడేందుకు వచ్చింది.
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా సెప్టెంబర్ 27న జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, మంగళవారం రెండో వన్డే కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగింది. పదేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై జరిగిన వన్డేలో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. బాబర్ అజామ్(115) సెంచరీతో రాణించడంతో పాక్ 67 పరుగులతో విజయం సాధించింది.
26 నిమిషాల పాటు ఆట నిలిపివేత
ఈ సిరిస్‌కు ముందు శ్రీలంకకు పూర్తి ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే, మూడు వన్డేల సిరిస్‌కు ఆతిథ్యమిస్తోన్న కరాచీలోని నేషనల్ స్టేడియం యొక్క ఎలక్ట్రిసిటీ వసతులను మాత్రం మరిచిపోయింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ కారణంగా సుమారు 26 నిమిషాల పాటు ఆటను నిలిపివేశారు.
శ్రీలంక ఛేదన సమయంలో
శ్రీలంక ఛేదన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫ్లడ్‌లైట్లు సమస్య తలెత్తడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి వాటిని తిరిగి పనిచేసేలా చేశారు. ఈ సమయంలో ఆటగాళ్లు మైదానంలోనే కూర్చుండిపోయారు. దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు సరిగ్గా వెలిగించేందుకు డబ్బులు లేవుగానీ మీకు కశ్మీర్ కావాలా? అని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు.
12,000 మంది మాత్రమే హాజరు
అంతేకాదు ఈ స్టేడియం మొత్తం సీటింగ్ సామర్థ్యం 32,000 వేలు కాగా, కేవలం 12,000 మంది మాత్రమే మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చారు. స్టేడియంలోని చాలా గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. దీనిపై మరొక నెటిజన్ కరాచీలో కర్ఫ్యూ విధించి మ్యాచ్ ఆడినట్లు ఉందని కామెంట్ పోస్టు చేశాడు.
305 పరుగులు చేసిన పాకిస్థాన్
సోమవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 67 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (115) సెంచరీ, ఫకర్ జమన్ (54) హాఫ్ సెంచరీతో రాణించారు.
రెండో వన్డేలో పాక్ విజయం
శ్రీలంక బౌలర్లలో హసరంగ డిసిల్వాకు 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 306 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 46.5 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బ్యాట్స్‌మెన్లలో షెహన్ జయసూర్య (96), షనక (68) హాఫ్ సెంచరీలు సాధించారు. ఆరో వికెట్‌కు 177 పరుగులు జోడించారు. పాక్ బౌలర్ షిన్వారి ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ సిరిస్‌లో చివరిదైనా ఆఖరి వన్డే బుధవారం ఇక్కడే జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications