Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బొటనవేలు విరిగినా తగ్గేదేలే! ఆస్ట్రేలియాను భయపెడుతున్న కుర్రాడు (Video)

గబ్బా వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-వెస్టిండీస్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ పింక్ బాల్ టెస్టులో విండీస్ గొప్పగా పోరాడుతోంది. వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. వరుస వికెట్లుతో ఆస్ట్రేలియాను భయపెడుతున్నాడు. అయితే అతడు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో తన బొటనవేలుకు తీవ్ర గాయమైంది. స్టార్క్ విసిరిన పదునైన యార్కర్ అతడి వేలుకి నేరుగా తగలడంతో ఫ్రాక్చర్ అయ్యిందని వార్తలు వచ్చాయి. నొప్పితో అతడు శనివారం మైదానాన్ని వీడాడు.

కానీ ఇవాళ తిరిగి మైదానంలో అడుగుపెట్టిన అతడు బంతితో అదరగొడుతున్నాడు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ ఆస్ట్రేలియాను భయపెడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ తర్వాత అద్భుత ప్రదర్శనతో 311 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ను 289/9 స్కోరుకు డిక్లేర్ చేసింది. 22 పరుగుల వెనుకంజలో ఉండి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గమనార్హం.

Shamar Joseph shows his courage against Australia Pink ball test

అయితే రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 193 పరుగులకు ఆలౌటైంది. మెకంజీ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖరి వికెట్‌గా షామర్ జోసెఫ్ (3) రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. స్టార్క్ వేసిన యార్కర్‌తో అతడి బొటనవేలుకి తీవ్రగాయమైంది. అనంతరం 216 పరుగుల లక్షఛేదనకు దిగిన ఆసీస్ శనివారం ఆట ముగిసేసరికి 60/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ ఇవాళ ఆటలో షామర్ ధాటికి ఆసీస్ 191 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది.

Shamar Joseph shows his courage against Australia Pink ball test

11 ఓవర్లు బౌలింగ్ చేసిన షామర్ జోసెఫ్ ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. కామెరూన్ గ్రీన్ (42), ట్రావిస్ హెడ్ (0) వరుస బంతుల్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వరుసగా మిచెల్ మార్ష్ (10), అలెక్స్ కేరీ (2), మిచెల్ స్టార్క్ (21), ప్యాట్ కమిన్స్ (2) వికెట్లు తీసి ఆస్ట్రేలియాను వణికించాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ (88*), హేజిల్ వుడ్ క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి మరో 13 పరుగులు అవసరం.

Story first published: Sunday, January 28, 2024, 13:08 [IST]
Other articles published on Jan 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+