Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిన్నేమో రోహిత్ శర్మపై.. ఇప్పుడు కోహ్లీపై కూడా.. షామా మహ్మద్ కాంట్రవర్సీ కామెంట్స్!!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురౌతుంది. సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు అందరూ ఆమెపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో షామా గతంలో విరాట్ కోహ్లీపై కూడా చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమెపై క్రికెట్ అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు.

అభిమానిపై కోహ్లీ ఫైర్..
2018లో కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఓ అభిమాని.. భారత క్రికెట్ ను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో పోలుస్తూ కామెంట్స్ చేశాడు. "నేను టీమిండియా కన్నా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆడే క్రికెట్ ను బాగా ఆస్వాదిస్తాను. కోహ్లీని అనవసరంగా పెద్ద బ్యాటర్ గా అభిమానిస్తుంటారు" అని అన్నాడు. దానికి కోహ్లీ.. "నువ్వు భారత్ లో నివసించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. భారత్ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్లి జీవించు. ఎందుకు ఇక్కడ ఉంటున్నావ్. భారత్‌లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏంటి. నీకు నేను నచ్చకపోవడంపై నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు." అంటూ కోహ్లీ రిప్లై ఇచ్చాడు.

shama mohamed Old Post On Virat Kohli goes viral after Rohit Sharma body shaming controversy comments

కోహ్లీ పోస్ట్ పై షామా ఘాటు స్పందన..
అయితే ఆ సమయంలో కోహ్లీ పెట్టిన రిప్లైపై షామా ఘాటుగా స్పందించింది. "బ్రిటిషర్లు కనిపెట్టిన గేమ్ ను కోహ్లీ ఆడతాడు. ఫారెన్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకున్నాడు. హెర్షెల్లె గిబ్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అని, ఏంజెలిక్ కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ అని అంటుంటాడు. కానీ ప్రజలను ఇతర దేశాల ప్లేయర్లను అభిమినుస్తున్నామని చెబితే మాత్రం, వారిని దేశాన్ని విడిచిపెట్టాలని అంటాడు" అని షామా... కోహ్లీ పోస్ట్ పై బదులిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందింస్తూ.. షామాకు ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ నచ్చరేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

Take a Poll
Story first published: Tuesday, March 4, 2025, 11:15 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+