Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shama Mohamed: 'రోహిత్ శర్మ చెత్త కెప్టెన్'.. షామా మహమ్మద్ ట్వీట్‌తో నెట్టింట దుమారం

Shama Mohamed: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 3 మ్యాచ్ లను గెలిచి సెమీఫైనల్ కు చేరుకుంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ హిట్ మ్యాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకురాలు రోహిత్ ను లావుగా ఉంటాడు.. చెత్త కెప్టెన్ అని అభివర్ణించింది. అతని కెప్టెన్సీని పనికిరానిదంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఈ ట్వీట్ అనంతరం క్రికెట్ అభిమానులందరూ సోషల్ మీడియాలో షామా పోస్ట్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. నెటిజన్లు తీవ్ర విమర్శల అనంతరం షామా మహమ్మద్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ ను తొలగించారు.

షామా మహమ్మద్ చేసిన ట్వీట్ తో ఈ వివాదం సోషల్ మీడియాలో మొదలైంది. షామా మహమ్మద్ ఇలా రాసుకొచ్చారు.."రోహిత్ శర్మ ఆటగాడిగా లావుగా ఉన్నాడు. అతను బరువు తగ్గాలి!. భారత్ కు చెందిన అత్యంత అసమర్థ కెపెన్." అని షామా మహమ్మద్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ ఫిట్‌నెస్, కెప్టెన్సీకి మద్దతుగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది రోహిత్ ఫిట్‌నెస్ పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. రోహిత్ భారత్ లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరు.

Shama Mohamed Calls Rohit Sharma Bad Captain Controversial Tweet Sparks Outrage

ఈ సంఘటన భారత క్రికెట్‌లో ఆటగాళ్ల ఫిట్‌నెస్, కెప్టెన్సీ ప్రమాణాలపై మరోసారి చర్చకు దారితీసింది. అయితే ఫిట్‌నెస్ ప్రమాణాలకు మించి ఎదగడం గురించి ఓ నెటిజన్ మాట్లాడుతూ.. భారత జట్టు, దాని కెప్టెన్ కు అభిమానులకు మద్దతు అవసరమైనప్పుడు.. ఓ రాజకీయ పార్టీ నాయకురాలు ఇలా బాడీ షేమింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే మరో వినియోగదారు ఆమెకు కౌంటర్ వేశారు. రాజకీయాలకు ఏ మాత్రం సరిపోని, ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర సృష్టిస్తున్న మీ బాస్ ను చూడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కానీ రోహిత్ మమ్మల్ని గర్వపడేలా చేశాడని.. అలాగే కొనసాగిస్తాడన్నారు.

షామా మహమ్మద్ ట్వీట్ పై ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ కూడా స్పందించారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా అనేక ఐపీఎల్ టైటిళ్లు గెలిచాడని.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వైట్ బాల్ జట్టుకు నాయకత్వం వహించాడని చెప్పారు. ఇలా వింత వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రోహిత్ శర్మ టీమిండియాకు అద్భుతమైన కెప్టెన్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఆటగాడిని బరువును బట్టి అంచనా వేయొద్దని.. అతని ఆటను బట్టి అంచనా వేయాలని సూచించారు.

Story first published: Monday, March 3, 2025, 11:19 [IST]
Other articles published on Mar 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+