ఐసీసీ ర్యాంకింగ్స్.. భారత్ నుంచి టాప్10లో ఒక్కరూ లేరు

బుధవారం ఎమ్మారెఫ్ టైర్స్ విడుదల చేసిన ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబుల్ హసన్ టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 359 రేటింగ్ పాయింట్లతో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను (339)ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
20 రేటింగ్ పాయింట్లు అధికం:
వెస్టిండీస్, ఐర్లాండ్ దేశాలతో జరిగిన వన్డే ట్రై సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన షకీబుల్ 140 పరుగులు చేసాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రెండు వికెట్లు కూడా తీసాడు. ఈ ప్రదర్శనతో ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్న రషీద్‌ఖాన్‌ను నెట్టి.. ఏకంగా 20 రేటింగ్ పాయింట్లు అధికంగా సాధించాడు. ప్రపంచకప్ ముందు షకీబుల్‌కు ఇది కలిసొచ్చే అంశమే.

మూడో స్థానంలో నబీ:
ఈ జాబితాలో అఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ ఆటగాడు ఇమామ్ వసీం, న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్ ), సికందర్ రజా (జింబాబ్వే ), మాథ్యూస్ (శ్రీలంక)లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

12వ స్థానంలో జాదవ్:
ఈ జాబితాలో టీమిండియా నుంచి టాప్ 10లో ఒక్కరు కూడా లేరు. కేదార్ జాదవ్ 12వ స్థానంలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఈ జాబితాలో లేడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా టాప్ 10లో చోటు దక్కించుకోలేదు. అయితే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇద్దరు చొప్పున ఆటగాళ్లు టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications