Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైడ్ ఇవ్వలేదని అంపైర్ మీదకు దూసుకెళ్లిన బ్యాటర్.. వీడియో వైరల్

Shakib Al Hasan storms to umpire over a wide call

క్రికెట్‌లో బౌలర్ వేసిన బంతి బ్యాటర్ కన్నా ఎత్తుగా వెళ్తే దాన్ని వైడ్ ఇస్తారని తెలుసు కదా. కానీ ఒక్కోసారి అంపైర్లు ఇలాంటి నిర్ణయాల్లో పొరపాట్లు చేస్తూనే ఉంటారు. అలా జరిగినప్పుడు చాలా సార్లు ఈ విషయాల్లో గొడవలు జరిగాయి. ఐపీఎల్‌, టీ20 వరల్డ్ కప్‌ వంటి టోర్నీల్లో కూడా ఇలాంటి ఘటనలు దుమారం రేపాయి. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కూడా అలాంటి ఘటనే జరిగింది. అయితే అంపైర్ వైడ్ ఇవ్వలేదనే కోపంతో బ్యాటర్ పెద్దగా అరుస్తూ అతని మీదకు వెళ్లడం మరింత చర్చనీయాంశంగా మారింది.

బంగ్లా వెటరన్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌కు కోపం ఎక్కువ. మైదానంలో కూడా దాన్ని అతను బహిరంగంగానే ప్రదర్శిస్తుంటాడు. తాజాగా అతని జట్టు ఫార్చూన్ బరిషల్‌.. సిలెట్ స్ట్రైకర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో షకీబల్ హసన్ 67 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే స్ట్రైకర్స్ బౌలర్ వేసిన ఒక షార్ట్ బాల్‌ అతని పై నుంచి వెళ్లింది. అది వైడ్ అని గట్టిగా నమ్మిన షకీబల్.. అంపైర్ వైపు చూశాడు. దాన్ని వైడ్ ఇవ్వని అంపైర్.. తొలి బౌన్సర్‌గా పరిగణనలోకి తీసుకున్నట్లు సైగ చేశాడు. అది చూసిన షకీబ్ కోపంతో 'ఏయ్.. ఏయ్..' అంటూ లెగ్ అంపైర్ వైపు వెళ్లాడు.

అప్పటికీ అంపైర్ నిర్ణయం మారకపోవడంతో నాన్‌స్ట్రైకర్ వద్ద ఉండే అంపైర్ దగ్గరకు వెళ్లి ఈ నిర్ణయంపై చర్చించాడు. ఆ అంపైర్‌తో కూడా మాట్లాడిన తర్వాత ఇక చేసేదేం లేక మళ్లీ బ్యాటింగ్‌ చేయడానికి వెళ్లిపోయాడు. ఇది చూసిన కామెంటేటర్లు ఇలా చేయడం కరెక్ట్ కాదని, దీని వల్ల ఎలాంటి మంచి జరగకపోగా అనవసరమైన చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయపడ్డాడు. గతంలో కూడా ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం తెచ్చుకున్న షకీబల్ హసన్.. అంపైర్ ఎదురుగా ఉన్న వికెట్లు పీకి అవతల పడేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, January 8, 2023, 17:30 [IST]
Other articles published on Jan 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+