
అసలు విషయాన్ని వదిలేసి:
తాజాగా ఫేస్‌బుక్‌లో ఉమ్మే అల్ హసన్ స్పందించారు. 'ఈరోజు జరిగిన ఘటనపై టీవీల్లో వార్తలు ప్రసారమవుతున్నాయి. అయితే అసలేం జరిగిందనే విషయాన్ని కొందరు అభిమానులు అర్థం చేసుకొని అండగా నిలిచారు. కానీ మీడియా అసలు విషయాన్ని వదిలేసి షకీబుల్ ఆగ్రహంతో ప్రవర్తించిన తీరునే హైలైట్ చేయడం బాధగా అనిపించింది. ఇక్కడ ప్రధానమైంది అంపైర్ తప్పుడు నిర్ణయాలు. దాన్ని వదిలేసి షకీబుల్ గురించి హెడ్‌లైన్లు రాయడం నన్ను తీవ్రంగా కలచివేసింది. కొంత కాలంగా ప్రతి విషయంలోనూ నా భర్తని విలన్‌గా చిత్రీకరించడానికి చూస్తున్నారని నాకు అనుమానం కలుగుతోంది' అని ఉమ్మే పేర్కొన్నారు.
క్షమాపణలు కోరుతున్నా:
మ్యాచ్ అనంతరం షకీబుల్ హసన్ ఫేస్‌బుక్‌లో తన ప్రవర్తన పట్ల బహిరంగ క్షమాపణలు కోరాడు. 'ప్రియమైన అభిమానులారా, ఇవాళ నా కోపంతో మ్యాచ్‌లో అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నా. నాలాంటి సీనియర్ ఆటగాడు ఇలా చేయాల్సింది కాదు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి. దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఆయా క్రికెట్ జట్లను, టోర్నీ నిర్వాహకులను, మ్యాచ్ పర్యవేక్షకులను క్షమాపణలు కోరుతున్నా. తప్పు జరిగిపోయింది. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి తప్పిదాలు చేయనని బలంగా నమ్ముతున్నా' అని షకీబుల్ అన్నాడు.

కాలితో స్టంప్స్‌ను పడగొట్టి:
శుక్రవారం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మొహమ్మదాన్, అబహాని జట్ల మధ్య జరిగింది. తాను బౌలింగ్ చేసిన ఐదో ఓవర్లో చివరి బంతికి ముష్ఫికర్ రహీమ్ ఎల్బీడబ్ల్యూ కోసం షకీబుల్ హసన్ అప్పీల్ చేయగా, అంపైర్ దానిని తిరస్కరించాడు. దాంతో వెనక్కి తిరిగి కాలితో స్టంప్స్‌ను తన్ని పడగొట్టిన షకీబుల్ అంపైర్‌తో వాదనకు దిగాడు. తర్వాతి ఓవర్ ఐదో బంతి తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు అంపైర్ పేర్కొన్నాడు. తన ఫీల్డింగ్ స్థానం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన షకీబుల్ మూడు స్టంప్స్‌ను ఊడబీకి కిందకు విసిరికొట్టాడు. ఆట ఆపేంత వర్షం రావడం లేదు కదా అని అసహనం ప్రదర్శించిన అతను ఆ తర్వాత కింద నుంచి స్టంప్స్‌ను తీసుకొని మళ్లీ అంపైర్ కాళ్ల దగ్గర పడేశాడు.

షకీబుల్‌పై చర్యలు తప్పవా:
షకీబుల్ హసన్ చర్యపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్ అనంతరం అతను ఒక ప్రకటన చేస్తూ బహిరంగ క్షమాపణ కోరాడు. అయితే మన్నింపు కోరినా సరే.. అతనిపై బంగ్లాదేశ్ బోర్డు చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన మొహమ్మదాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అబహని వర్షం అంతరాయం కలిగించే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మొహమ్మదాన్ 31 పరుగులతో గెలిచింది.


Click it and Unblock the Notifications












