Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షకీబుల్‌ ఒంటరి పోరాటం.. అండగా నిలిచిన సైఫుద్దీన్! ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై బంగ్లా విజయం!

Shakib Al Hasan, Mohammad Saifuddin heroic innings Bangladesh to series win vs Zimbabwe

హరారే: జింబాబ్వేపై మొదటి వన్డేలో ఘన విజయం సాదించిన బంగ్లాదేశ్.. రెండో వన్డేలో మాత్రం అతికష్టం మీద గెలిచింది. మూడు వన్డేల సిరీసులో భాగంగా ఆదివారం హరారేలో జరిగిన రెండో మ్యాచులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ (96 నాటౌట్‌; 109 బంతుల్లో 8x4) ఒంటరి పోరాటం చేశాడు. 50వ ఓవర్ మొదటి బంతికి బౌండరీ బాది బంగ్లాకు అద్భుత విజయాన్ని అందించాడు. అతడికి మొహమ్మద్ సైఫుద్దీన్ (28 నాటౌట్‌; 34 బంతుల్లో 1x4) అండగా నిలిచాడు. ఈ విజయంతో బంగ్లా సిరీసును ఇప్పటికే కైవసం చేసుకుంది.

ఈ మ్యాచులో టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ తినాషే కామున్హుకామ్వే ఒక పరుగుకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ టీ మరుమాకు 13 పరుగులు చేశాడు. ఈ సమయంలో రెగిస్ చక్కబవా (26), బ్రెండన్ టేలర్ (46) జింబాబ్వే ఇన్నింగ్స్‌ను చక్క్కదిద్దారు. ఆపై డియోన్ మైయర్స్ (34), వెస్లీ మాధ్వెరే (56) మరో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. మాధ్వెరే ఔట్ అయినా.. సికందర్ రాజా (30) చివరి వరకు పోరాడి భారీ స్కోర్ అందించాడు. బంగ్లా బౌలర్ షరీఫుల్ ఇస్లాం 4 వికెట్లు పడగొట్టాడు.

ఆపై 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు తమీమ్ ఇక్బల్ (20), లిటన్ దాస్ (21) తక్కువ పరుగులకే ఔట్ అయ్యరు. ఒకవైపు షకీబుల్‌ హసన్‌ క్రీజులో నిలబడ్డా.. మహ్మద్ మితున్ (2), మోసాద్దెక్ హుస్సేన్ (5) పెవిలియన్ చేరారు. మితున్ క్యాచ్ ఔట్ కాగా.. హుస్సేన్ రనౌట్ అయ్యాడు. దీంతో బంగ్లా 75 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో షకీబుల్‌ భారీ షాట్లకు పోకుండా.. నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. అతడికి మొహమ్మదుల్లా (26) సహకరించాడు.

అయితే కొద్ది వ్యవధిలో మొహమ్మదుల్లా, మెహిదీ హాసన్ ఔట్ అవ్వడంతో జింబాబ్వే శిబిరంలో ఆశలు చిగురించాయి. అఫీఫ్ హుస్సేన్ (15) అండతో షకీబుల్‌ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో బంగ్లా మళ్లీ రేసులోకి వచ్చింది. అయితే హుస్సేన్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠతకు దారితీసింది. టేయిలెండర్లు ఉండడంతో జింబాబ్వే విజయం సాదిస్తుందని అందరూ అనుకున్నారు. షకీబుల్‌-సైఫుద్దీన్ జోడి ఆ అవకాశం ఇవ్వలేదు. సైఫుద్దీన్ సింగిల్స్ తీస్తూ పరుగులు సాదించాడు. చివరికి షకీబుల్‌ విన్నింగ్స్ షాట్ ఆడి బంగ్లాను గెలిపించాడు. జింబాబ్వే బౌలర్ ల్యూక్ జోంగ్వే రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Sunday, July 18, 2021, 23:55 [IST]
Other articles published on Jul 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+