
షకీబుల్‌కు అండగా నిలవాలి:
నిషేదానికి గురైన షకీబుల్ హసన్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అండగా నిలిచారు. తాజాగా ప్రధాని ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'షకీబుల్ పొరపాటు చేశాడు. ఆ విషయాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం, క్రికెట్ బోర్డు ఏమి చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. షకీబుల్ నిరాశ చెందకూడదు. ఇలాంటి సమయంలో షకీబుల్‌కు అండగా నిలవాలని బంగ్లా క్రికెట్ బోర్డుకు సూచిస్తున్నా' అని పేర్కొన్నారు.

షకీబుల్ గొప్ప క్రికెటర్:
'షకీబుల్ హసన్ గొప్ప క్రికెటర్. సుదీర్ఘ కాలంగా బంగ్లాదేశ్‌కు ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. వచ్చే ఏడాది టీ20 మెగాటోర్నీ ఉంది. ఇలాంటి కీలక సమయంలో అతడు జట్టుకు దూరమవడం బాధాకరం. అయితే నిషేధం కాలం ముగిసిన తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి దేశానికి సేవచేస్తాడని ఆశిస్తున్నాం' అని బీసీబీ ట్వీట్ చేసింది.

మూడు వేర్వేరు అభియోగాలు:
2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబుల్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. ఇక 2018 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించారు. ఆ విషయాన్ని కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది.

టీ20 ప్రపంచకప్‌కు దూరం:
ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకీబుల్ తన తప్పులను ఒప్పుకున్నాడు. తన తప్పు అంగీకరించడంతో ఐసీసీ శిక్ష విధించింది. నిషేధం నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు షకీబుల్ దూరం అవుతాడు. అయితే 2020 అక్టోబర్ 29 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు మాత్రం ఐసీసీ అనుమతి ఇచ్చింది.

చాలా బాధపడుతున్నా:
'నిషేధానికి గురైనందుకు చాలా బాధపడుతున్నా. నా తప్పులను అంగీకరించా. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం నిబంధనలను పాటించడంలో విఫలమయ్యా. అందరిలాగే నేను క్రికెట్ అవినీతి రహితంగా ఉండాలని కోరుకున్నా. నాలాగే యువకులు ఇలాంటి తప్పులు చేయకుండా ఐసీసీతో కలిసి పనిచేస్తా' అని షకీబుల్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












