వరల్డ్‌కప్: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ ఖాతాలో మరో రికార్డు

హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ ఉల్ హాసన్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ ఉల్ హాసన్ వన్డేల్లో 5000లకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
సపారీలతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ అయిడెన్ మార్క్రమ్ వికెట్ తీయడంతో వన్డేల్లో షకీబ్ 250 వికెట్లు పడగొట్టాడు. అత్యంత వేగంగా 199 వన్డేల్లో ఈ రికార్డు అందుకున్న ఆటగాడిగా షకీబ్ ఉల్ హాసన్ చరిత్ర సృష్టించాడు. కాగా, వన్డేల్లో 5000 పరుగులు పూర్తి చేసి 250 వికెట్స్ తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో సనత్ జయసూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

షకీబ్ ఖాతాలో అరుదైన రికార్డు
ఆ తర్వాత జాక్వస్ కల్లిస్, షాహిది అఫ్రిది, అబ్ధుల్ రజాక్ లాంటి ఆటగాళ్లు మాత్రమే ఉండగా తాజాగా ఆ జాబితాలో షకీబ్ ఉల్ హసన్ చేరాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.

21 పరుగుల తేడాతో బంగ్లా విజయం
ముష్ఫికర్ రహీమ్ (80 బంతుల్లో 78), షకీబ్ అల్ హసన్ (84 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 331 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులకే పరిమితం కావడంతో 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

వన్డేల్లో 5000కుపైగా పరుగులు, 250కిపైగా వికెట్లు తీసిన ఆల్ రౌండర్లు:
అబ్ధుల్ రజాక్ (పాకిస్థాన్): 269 wickets | 5080 runs
సనత్ జయసూర్య (శ్రీలంక): 323 wickets | 13430 runs
జాక్వస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా): 273 wickets | 11579 runs
షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్): 395 wickets | 8064 runs
షకీబ్ ఉల్ హాసన్ (బంగ్లాదేశ్): 250 wickets | 5792 runs

వన్డేల్లో అత్యంత వేగంగా వికెట్లు తీసిన అల్ రౌండర్లు:
- 199 - షకీబ్ ఉల్ హాసన్
- 258 - అబ్ధుల్ రజాక్
- 273 - షాహిద్ అఫ్రిది
- 296 - జాక్వస్ కల్లిస్
- 304 - సనత్ జయసూర్య
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications