న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కఠిన శిక్ష: బంగ్లా జట్టుకు షాక్, షకీబ్‌పై రెండేళ్ల నిషేధం విధించిన ఐసీసీ

Shakib Al Hasan Confined For 2 Years Under ICC A-C Code ! || Oneindia Telugu
Shakib Al Hasan banned after failing to report corrupt approach


హైదరాబాద్:
భారత పర్యటనకు ముందు బంగ్లాదేశ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్‌పై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఇందులో ఏడాది సస్పెన్షన్‌ తర్వాత క్రికెట్‌ ఆడొచ్చని వెల్లడించింది.

నిషేధం అనంతరం షకీబ్ ఉల్ హాసన్ మాట్లాడుతూ "నేను ఎంతో ప్రేమించే ఆట నుంచి నన్ను నిషేధించడంతో ఎంతో బాధగా ఉంది. కానీ, నేను చేసిన తప్పుని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఆటగాళ్లు అవినీతిపై ధీటుగా పోరాటం చేయడానికి ఐసీసీ, ఏసీయూ ఎంతో తోడ్పడతాయి. నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు" అని అన్నాడు.

తొలి టీ20పై కాలుష్యం ఎఫెక్ట్: భారత ఆటగాళ్ల ఔట్ డోర్ ట్రైనింగ్ సెషన్ రద్దు!తొలి టీ20పై కాలుష్యం ఎఫెక్ట్: భారత ఆటగాళ్ల ఔట్ డోర్ ట్రైనింగ్ సెషన్ రద్దు!



అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా ఓ బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని షకీబ్‌కు ఓ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. తనను బుకీ కలిసి ఆఫర్ ఇచ్చిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక మరియు భద్రతా విభాగానికి (ఎసిఎస్‌యు) షకీబ్ నివేదించలేదు. కానీ అతను అలా చేయలేదు.

ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం

దీంతో ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం షకీబ్‌పై రెండు అభియోగాలు నమోదయ్యాయి. 2018 ఐపీఎల్‌ సందర్భంలో 2018 ఏప్రిల్‌ 26న సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా బుకీలు సంప్రదించడాన్నీ వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. దీంతో ఐసీసీ అతనిపై విచారణకు ఆదేశించింది.

మూడు చార్జ్‌లను ఉల్లంఘించానని అంగీకరించిన షకీబ్

విచారణలో యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు చార్జ్‌లను ఉల్లంఘించినట్లు షకీబ్ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్‌కు శిక్షను ఖరారు చేసింది. నిషేధ కాలంలో ఐసీసీ నిబంధనలు సక్రమంగా పాటిస్తే 2020 అక్టోబర్‌ 29 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు ఐసీసీ అనుమతి ఇవ్వడం కొసమెరుపు.

షకీబ్ లేకుండా కొత్త జట్టు

షకీబ్ లేకుండా కొత్త జట్టు

షకీబ్‌పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించిన నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు షకీబ్ ఉల్ హాసన్ లేకుండా తాజా టీ20 జట్టును ప్రకటించనుంది. బుధవారం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. భారత పర్యటనకు షకీబ్ దూరమైతే ముష్ఫికర్‌ రహీమ్‌ టెస్టులు, మొసాదిక్‌ హుస్సేన్‌ టీ20లకు నాయకత్వం వహించనున్నారు.

Story first published: Tuesday, October 29, 2019, 19:08 [IST]
Other articles published on Oct 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X