బ్రిస్బేన్: ఐసీసీ వరల్డ్ కప్‌లో గ్రూప్ బిలో భాగంగా బ్రిస్బేన్‌లో ఐర్లాండ్-యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 278 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఐర్లాండ్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసి విజయం సాధించింది.
యూఏఈ-ఐర్లాండ్ మ్యాచ్ స్కోరుకార్డు
ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో విల్సన్ అత్యధికంగా 80 పరుగులు చేశాడు. కెవిన్ ఒబ్రెయెయిన్ అర్ధ సెంచరీ సాధించగా, జాయ్స్ 37, విలియం ఫోర్డర్ ఫీల్డ్ 37 పరుగులతో ఉన్నారు. యూఏఈ బౌలర్లలో జావేద్ 3, మహ్మాద్ 2, మొహమ్మద్ టౌకిర్ 2 వికెట్లు తీసుకోగా, గురిగే ఒక వికెట్ తీసుకున్నారు.

ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోయూఏఈ బౌలర్ మహ్మద్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. ఐర్లాండ్ జట్టు స్కోరు 94 పరుగుల వద్ద పోర్టర్ ఫీల్డ్ వికెట్ తీసిన మహ్మద్....97 పరుగుల వద్ద నీల్ ఓబ్రైన్(17)ను పెవిలియన్‌కు పంపి యూఏఈకి చక్కని బ్రేక్ ఇచ్చాడు. దీంతో ఐర్లాండ్ 25.2 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో యూఏఈ బ్యాట్స్‌మెన్ షైమన్ అన్వర్ సెంచరీ చేశాడు. అతను కేవలం 79 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 100 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో తొలి సెంచరీ చేసిన యూఏఈ ఆటగాడిగా అన్వర్ చరిత్ర సృష్టించాడు. అన్వర్ 106 వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా సోరేసన్ బౌలింగ్‌లో విల్సన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
యూఏఈలో అంజాద్ అలీ (45), అంజాద్ జావేద్ (42), ఖుర్రం ఖాన్ (36) రాణించారు. ఇక ఐర్లాండ్ బౌలర్లు స్టిర్లింగ్, కెవిన్ ఒబ్రెయెయిన్, సొరెన్సన్ తలా రెండు వికెట్లు తీసుకోగా, డాక్‌రెల్ ఒక వికెట్‌ను తీసుకున్నారు.