Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఇళ్లు తగలబెడతామని బెదిరింపులు': పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

Shahid Afridi: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి, ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా శిఖర్ ధావన్ లక్ష్యంగా షాహిద్ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిది భారత క్రికెటర్ల గురించి మాట్లాడుతూ.. "అక్కడ(భారత్‌లో) పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆటగాళ్ల ఇళ్లకు వెళ్లి వారి ఇళ్లు తగలబెడతామని బెదిరింపులు ఇస్తున్నారు. కొంత మంది భారత క్రికెటర్లు తాము హిందుస్థానీయులమని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి వారు తాము హిందుస్థానీయులమని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు ఆసియా కప్‌లో కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు." అని షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించారు. అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అఫ్రిదికి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన భారత్‌పై అనేక సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

Shahid Afridi s Shocking Burn Homes Comment Ahead of IND vs PAK Match

పహల్గామ్ దాడి.. మ్యాచ్‌పై వివాదం
ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడిలో పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉందని భారత నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్ అభిమానులు, పలు సంస్థలు డిమాండ్ చేశాయి. కానీ భారత ప్రభుత్వం బహుళ దేశాల టోర్నమెంట్లలో మాత్రమే పాకిస్థాన్ జట్టుతో ఆడేందుకు భారత జట్టుకు అనుమతి ఇచ్చింది. ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రం అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.

భారత్-పాక్ మ్యాచ్‌పై తగ్గిన ఉత్సాహం
సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై గతంలో ఉన్నంత ఉత్సాహం అభిమానుల్లో కనిపించడం లేదు. పహల్గామ్ దాడి, పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలపై అభిమానుల్లో పెరిగిన ఆగ్రహం దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో అమ్ముడుపోయి, రికార్డులు సృష్టించేవి. కానీ ఇప్పుడు ఆసియా కప్ మ్యాచ్ టికెట్లు చాలా వరకు ఇంకా అందుబాటులో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇది పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటం పట్ల భారత అభిమానుల అసంతృప్తిని స్పష్టంగా సూచిస్తుంది.

అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఈ మ్యాచ్‌పై మరింత ఉద్రిక్తతను పెంచాయి. ఈ మ్యాచ్ అభిమానుల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసే అవకాశం ఉంది. రాజకీయ ఉద్రిక్తతలు క్రికెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.

Story first published: Friday, September 12, 2025, 9:34 [IST]
Other articles published on Sep 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+