'సచిన్‌ బ్యాట్‌తోనే అఫ్రిది ఫాస్టెస్ట్ సెంచరీ చేసాడు.. డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా మారాడు'

కరాచీ: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిది అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్‌లోనే వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. 1996లో నైరోబీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో శతకం సాధించాడు. 16 ఏళ్ల వయస్సులో అఫ్రిది ఈ ఘనత అందుకున్నాడు. 18 ఏళ్ల పాటు ఆ రికార్డును తనపేరే నిలుపుకున్నాడు. అయితే ఈ అద్బుత ప్రదర్శన వెనక భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పాత్ర కూడా ఉందని ఆఫ్రిది సహచరుడు అజహర్‌ మహమూద్‌ తాజాగా వెల్లడించాడు.

37 బంతుల్లో శతకం:

37 బంతుల్లో శతకం:

తాజాగా అజహర్‌ మహమూద్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... '1996లో షాహిద్‌ అఫ్రిది అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ముస్తాక్‌ అహ్మద్‌ గాయపడటంతో పాకిస్తాన్‌-ఎ పర్యటనలో ఉన్న అఫ్రిదికి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కింది. తొలి మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం దక్కలేదు. ఎందుకంటే అతడిని ఆరవ స్థానంలో ఆడించాలని పాక్ మేనేజ్మెంట్ భావించింది. రెండో మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన అఫ్రిది 40 బంతుల్లో 104 పరుగులు చేసాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో శతకం సాధించాడు' అని తెలిపాడు.

 సచిన్‌ బ్యాట్‌తోనే:

సచిన్‌ బ్యాట్‌తోనే:

'ఆ రోజుల్లో శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య, వికెట్ కీపర్ రొమేష్ కలువితారన ఆది నుంచే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేవారు. అలాంటి వారు మనకు అవసరమని పాక్ మేనేజ్మెంట్ అనుకుంది. ముఖ్యంగా 3వ స్థానంలో ధాటిగా బ్యాటింగ్ చేయగల సరైన ఆటగాడి కోసం చూసింది. మరుసటి రోజు అఫ్రిదిని మూడో స్థానంలో పంపాం. సక్సెస్ అయ్యాడు. అయితే ఆ మ్యాచ్‌లో అఫ్రిది వాడిన బ్యాట్‌ను సచిన్‌ టెండూల్కర్ తన కానుకగా వకార్‌ యూనిస్‌కిచ్చాడు. వకార్‌ నుంచి ఆ బ్యాట్‌ ఆఫ్రిది చేతికందింది. అంతకుముందు బౌలర్‌గానే గుర్తింపు తెచ్చుకున్న అఫ్రిది.. అలా సచిన్‌ బ్యాట్‌తో డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా మారాడు' అని అజహర్‌ చెప్పాడు.

అఫ్రిది విలువైన ఆస్తి:

అఫ్రిది విలువైన ఆస్తి:

'2011 ప్రపంచకప్‌లో షాహిద్‌ అఫ్రిది పాక్ జట్టును అద్భుతంగా నడిపించాడు. అతను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. బాగా బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో లెజెండ్ అబ్దుల్ ఖాదిర్ నుండి అఫ్రిది ఓ అద్భుత డెలివరీ నేర్చుకున్నాడు. ఆ డెలివరీ నేరుగా వెళ్లి ప్యాడ్లను తాకేది. బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు. అందుకే అతనికి 2011 ప్రపంచకప్‌ గొప్పది. అయితే దురదృష్టవశాత్తు మేము భారత్ చేతిలో ఓడిపోయాం. ఏదేమైనా అఫ్రిది పాక్ జట్టుకు విలువైన ఆస్తి' అని అజహర్‌ పేర్కొన్నాడు.

భారత్‌పై 22 పరుగులకు మించి చేయలేదు:

భారత్‌పై 22 పరుగులకు మించి చేయలేదు:

అంతర్జాతీయ కెరీర్‌లో షాహిద్‌ అఫ్రిది 27 టెస్టుల్లో, 398 వన్డేల్లో, 99 టీ20 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేలకు పైగా రన్స్ బాదాడు. 1999 నుంచి అఫ్రిది ప్రపంచకప్‌లు ఆడుతున్నా.. ఒక్కసారి కూడా భారత్‌పై 22 పరుగులకు మించి చేయలేదు. తొలిసారి 6 పరుగులు చేసిన అఫ్రిది.. 2003లో 9 పరుగులే చేశాడు. అనంతరం 2011లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్న అఫ్రిది ఛేదనలో 19 పరుగులే చేశాడు. ఇక 2015లో 22 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా చూస్తే పాక్‌ మాజీ క్రికెటర్‌ భారత్ చేతిలో ఘోరంగా విఫలమయ్యాడు.

ధోనీ రూమ్​లోనే ఫుట్​బాల్ మ్యాచ్ చూసేవాడిని: ఇంగ్లండ్ బ్యాట్స్​మన్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, August 4, 2020, 12:19 [IST]
Other articles published on Aug 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X