
హైదరాబాద్: భారత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంతో అమాయక ప్రజలు బలైపోతున్నారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది పేర్కొన్నాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి కశ్మీర్ అంశంలో జాలి కురిపించాడు. ఇప్పటి వరకు ఉన్న వివాదాలు చాలవన్నట్లు కశ్మీర్ లోయలో మరింత అలజడి సృష్టించే వ్యాఖ్యలు చేశాడు.
కశ్మీర్‌లో ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. వారిపై తీవ్రమైన అణచివేత కొనసాగుతోందని, దాన్ని వ్యతిరేకిస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తోన్న అమాయకులు భారత్ సైన్యం తుపాకీ తూటాలకు బలైపోతున్నారని పేర్కొన్నారు. అమాయకులైన ప్రజలపై నిర్బంధ కాండ కొనసాగుతుంటే ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవడంలేదని అన్నారు.
ఇలా కశ్మీర్ విషయంపై అఫ్రీది వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా కశ్మీర్ అంశంపై అఫ్రిది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అఫ్రీది వ్యాఖ్యలకు భారత జట్టు క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ వ్యంగ్యంగా స్పందించాడు. 'కశ్మీర్ ఇంకా యూఎన్ అని సంభోదించడంలో అర్థం. యూఎన్ అంటే అండర్ నైన్‌టీన్ అని అతని ఉద్దేశం కాబోలు. నో బాల్ వేసి వికెట్ పడిందని ఆనందపడుతున్నాడు అఫ్రీది. మీడియా ఏం కంగారు పడాల్సిన అవసర్లేదు' అని చమత్కరించాడు.
మార్చి 2016లో ఆస్ట్రేలియాలోని మొహాలి వేదికగా జరిగిన టీ 20 మ్యాచ్ జరిగింది. ఆ సమయంలోనూ కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్ ను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలంటూ పేర్కొన్నాడు అఫ్రీది. కోల్‌కత్తా వేదికగా జరిగిన కార్యక్రమంలో కశ్మీర్ ప్రజలనుద్దేశించి ఆయన అలా మాట్లాడాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్న అఫ్రిది 27 టెస్ట్‌లు, 398 వన్డేలు, 98 టీ20ల్లో ఆడారు. 2011 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జట్టుకు సారథ్యం వహించాడు.