Shahid Afridi: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత్‍పై విషం కక్కాడు. పాకిస్థాన్ అభివృద్ధికి భారత్ అడ్డంకులు సృష్టిస్తోందని అఫ్రిది విమర్శించారు. పాకిస్థాన్‌లో విజయ యాత్ర సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెళ్లగక్కాడు. ఇండో-పాక్ వివాదం అనంతరం భారత సైన్యం చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైనప్పటికీ.. షాహిద్ అఫ్రిది పాకిస్థాన్‌లో విజయయాత్రకు నాయకత్వం వహించాడు. అయినప్పటికీ పాకిస్థాన్ సైన్యం ఈ వివాదంలో గెలిచిందని అఫ్రిది ప్రతి చోటా ప్రచారం చేస్తున్నాడు. పాకిస్థాన్‌లో మీడియాతో మాట్లాడుతూ షాహిద్ అఫ్రిది భారత్‌ను తీవ్రంగా విమర్శించాడు.
భారత్ పాక్ పురోగతిని ఆపుతోంది..
భారత్ అభివృద్ధి చెందుతోందని.. దాని పురోగతి పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని షాహిద్ అఫ్రిది అన్నాడు. భారత క్రికెట్ పురోగమిస్తోందని.. ఇది మంచి విషయమేనన్నాడు. పాక్ ముందుకు సాగుతున్న కొద్దీ ఆపుతున్నారని.. పొరుగువారికి ఇది ఎలాంటి పని అంటూ తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌ను ముందుకు సాగకుండా భారత్ ఆపుతోందని షాహిద్ అఫ్రిది ఆరోపించాడు. దీని తర్వాత షాహిద్ అఫ్రిది మాటలపై నెట్టింట సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన దేశ ప్రజలే తమ దేశానికి శత్రువులనే విషయాన్ని షాహిద్ అఫ్రిది మర్చిపోయాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

భారత సైన్యం పట్ల షాహిద్ అఫ్రిది ద్వేషానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. నిజానికి షాహిద్ అఫ్రిది బంధువు భారత్-పాక్ సరిహద్దులో చంపబడ్డాడు. 2003లో అనంతనాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో షాహిద్ అఫ్రిది సోదరుడిని బీఎస్ఎఫ్ హతమార్చింది. షాహిద్ అఫ్రిది సోదరుడి పేరు షకీబ్. షకీబ్ హర్కత్-ఉల్-అన్సార్ బెటాలియన్ కమాండర్ గా విధులు నిర్వర్తించేవాడు. ఆ సమయంలో షకీబ్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు షకీబ్‌కు షాహిద్ అఫ్రిదితో సంబంధాలు ఉన్నాయని బీఎస్ఎఫ్ వెల్లడించింది. కానీ అప్పుడు షాహిద్ అఫ్రిది ఈ విషయాన్ని ఖండించారు.