For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాపెల్ ఇప్పుడేమంటావ్?: ఎదురుదాడికి దిగిన ఆఫ్రిది

పాకిస్థాన్ జట్టుకు ఆడటం రాకపోతే ఇంట్లో కూర్చుంటే మంచిదని ఇటీవల ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

By Nageshwara Rao

హైదరాబాద్: పాకిస్థాన్ జట్టుకు ఆడటం రాకపోతే ఇంట్లో కూర్చుంటే మంచిదని ఇటీవల ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో ఇటీవలే ముగిసిన జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

అయితే టెస్టు సిరిస్ అనంతరం వన్డే సిరిస్ ప్రారంభమైంది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను 1-1తో సమం చేసింది. ఆసీస్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించడంతో ఆ దేశ క్రికెటర్లు చాపెల్‌పై ఎదురుదాడికి దిగారు. 'పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ హాఫీజ్‌కు అభినందనలు. పాక్ గెలిచింది కదా చాపెల్ ఇప్పుడేమంటావ్? పాకిస్తాన్ గెలిచిన మ్యాచ్‌ను చూశావా? అని షాహిద్ ఆఫ్రిది ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా చాపెల్ వ్యాఖ్యలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డాడు. 'అదొక బాధ్యాతరాహిత్యమైన ప్రకటనే కాదు. ఎటువంటి ఉపయోగంలేని స్టేట్ మెంట్. శ్రీలంక చేతిలో ఇటీవల ఆస్ట్రేలియా వైట్‌వాష్ కాలేదా? భారత్‌పై సిరీస్‌ను ఘోరంగా ఓడిపోలేదా? పాక్ చేతిలో యూఏఈలో వైట్‌వాష్ కాలేదా? మరి దానిని ఏమంటారు' అని మిస్బా నిలదీశాడు.

 Shahid Afridi Takes A Dig At Ian Chappell After Pakistan Beat Australia

ఆసీస్ చేతిలో పాకిస్థాన్ వైట్ వాష్ అయిన అనంతరం 'ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఇప్పటివరకూ నాలుగుసార్లు వైట్ వాష్ అయ్యింది. మూడేసి మ్యాచ్‌ల సిరీస్‌లను నాలుగుసార్లు కోల్పోయింది. మీరు గేమ్‌ను మెరుగుపరుచు కోలేకపోతే, పర్యటనల్ని పక్కన పెట్టి ఇంట్లోనే కూర్చోండి. ఎప్పుడూ చెత్త ప్రదర్శన చేసేటప్పుడు పర్యటనలకు ఎందుకు' అని చాపెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతక ముందు చాపెల్ వ్యాఖ్యలపై అక్తర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. పాకిస్థాన్ జట్టు కామెడీ చేయడానికి ఆస్ట్రేలియా రాలేదని, కాంపిటీటివ్ గేమ్ ఆడేందుకు ఆసీస్ వచ్చారని తెలుసుకోవాలని చాపెల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన మెరుగ్గా లేదన్న మాట వాస్తవమేనని, ఆ విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపాడు.

అయితే క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ నెగ్గిందా? అలాగని వాళ్లు ఇంట్లో కూర్చుంటున్నారా? అని అక్తర్ ధీటుగా ప్రశ్నించాడు. అంతేకాదు ఫీల్డింగ్ లోపం వల్లే తమ జట్టు వైఫల్యాలు కొనసాగుతున్నాయని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+