Shahid Afridi: ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2025 ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మ్యాచ్ దాదాపు రద్దయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్యే పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అఫ్రిది మరోసారి ఇండియాపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ కనిపించాడు.
వివాదానికి దారితీసిన అఫ్రిది వ్యాఖ్యలు
వాస్తవానికి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య లీగ్ దశలోనే ఒక మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెటర్లు చాలా మంది పాకిస్థాన్‌తో ఆడడానికి నిరాకరించారు. దీంతో ఆ మ్యాచ్ రద్దయింది.ఇప్పుడు, సెమీ-ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ ఖరారు కావాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్యనే షాహిద్ అఫ్రిదికి సంబంధించిన వైరల్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో షాహిద్ అఫ్రిది ఒక రెస్టారెంట్‌లో మాట్లాడుతూ.. "భారత్ ఇక ఏ మొహంతో ఆడుతుందో తెలియదు, కానీ మాతోనే ఆడాలి" అని వ్యాఖ్యానించారు. షాహిద్ అఫ్రిది చేసిన ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. భారత అభిమానులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. అఫ్రిది భారత్‌పై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలుమార్లు భారత్ వ్యతిరేక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత కూడా అఫ్రిది భారత సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెద్ద దుమారం రేపారు.

బహిష్కరించిన శిఖర్ ధావన్
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ పై భారత ఆటగాళ్ల వైఖరి కూడా స్పష్టంగా ఉంది. ఇటీవల ఒక జర్నలిస్టు భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ను వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ జరిగితే ఆడతారా అని ప్రశ్నించారు. దీనికి ధావన్ సున్నితంగా స్పందిస్తూ.. "భాయ్, మీరు ఇప్పుడు తప్పు చోట ఈ ప్రశ్న అడుగుతున్నారు. నేను దీనికి సమాధానం ఇస్తానని మీరు అనుకుంటున్నారా? మీరు ఇలాంటి ప్రశ్న అడగకూడదు. నేను గతంలో ఆడకపోతే, ఇప్పుడు కూడా ఆడను," అని స్పష్టం చేశారు. శిఖర్ ధావన్ వ్యాఖ్యలు భారత ఆటగాళ్ల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయి. క్రికెట్ మైదానంలో కూడా రాజకీయాలు, దేశభక్తి కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.