
ఐస్ క్రికెట్ ఛాలెంజ్:
కొత్తగా వింతగా మొదలుకాబోతున్న ఐస్ క్రికెట్ ఛాలెంజ్. దీనిలో సెహ్వాగ్ జట్టుకు ప్రత్యర్థి జట్టుగా అఫ్రీది కెప్టెన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. వీరూ వైపు ఎక్కువ మంది భారత ఆటగాళ్లు ఉండగా షాహిద్ జట్టులో అత్యధిక మంది పాక్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో పోటీ ఆసక్తికరంగా సాగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాయల్స్ జట్టుకు అఫ్రీది:
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఈ వెరైటీ టీ20 టోర్నీ గురువారం ఆరంభంకానుంది. ఫిబ్రవరి 8,9 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే పొట్టి క్రికెట్‌లో బ్యాడ్‌రట్స్‌కు సెహ్వాగ్, రాయల్స్‌కు అఫ్రీది సారథ్యం వహిస్తున్నారు.

వేదిక స్విట్జర్లాండ్:
ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్థాన్ మాజీ షాహిద్ అఫ్రీది మరోసారి సై అంటే.. సై అననున్నారు. స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్‌లో ఈ క్రేజీ ఐస్ క్రికెట్ టోర్నీ గురువారం మొదలు కానుంది.
నేనూ సై అంటోన్న అఫ్రీది:
వీరూ టీమ్‌లో జహీర్ ఖాన్, మహమ్మద్ కైఫ్, అజిత్ అగార్కర్‌తోపాటు లంక మా జీ జయవర్దనె, తిలక రత్నే, మలింగ, ఆసీస్ మాజీలు హస్సీ, సైమండ్స్ ఆడనున్నారు. స్విస్‌లో ఐస్ క్రికెట్ చాలెంజ్‌కు తాను సిద్ధమని అఫ్రీది ట్వీట్ చేశాడు. అఫ్రీది జట్టులో జాక్వెస్ కలీస్, గ్రేమ్ స్మిత్, డేనియల్ వెటోరి, నాథన్ మెక్‌కలమ్, మాంటీ పనేసర్, షోయబ్ అక్తర్, అబ్దుల్ రజాక్, గ్రాంట్ ఇలియట్ తదితరులు


Click it and Unblock the Notifications











