IND vs PAK: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది అమాయక భారతీయుల చితికి నిప్పులు చల్లారలేదు. ఇంతలో సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘించడం సహా భారత్ తీసుకున్న 5 పెద్ద నిర్ణయాలు పాకిస్థాన్ అంతటా తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది బాధపడడం లేదు కానీ ఈ ఉగ్రవాద దాడికి రుజువు కావాలని తనలోని అక్కసును వెళ్లగక్కాడు. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ పాకిస్థాన్‌ను నిందిస్తోందని అఫ్రిది ఆరోపించాడు. పాకిస్థాన్‌పై చేసిన ఆరోపణలకు భారత్ ఆధారాలు అందించాలని అఫ్రిది డిమాండ్ చేశాడు.
భారత్ ఈ వైఖరి దురదృష్టకరమని అన్నాడు. రెండు దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడం గురించి మాట్లాడాడు. చర్చల ద్వారా మాత్రమే పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించగలమని అఫ్రిది విశ్వసిస్తున్నాడు. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. పాకిస్థాన్‌తో భారత్ అనేక సంబంధాలను తెంచుకుంది. కాశ్మీర్‌లో జరిగిన ప్రాణనష్టంపై అఫ్రిది వింతగా విచారం వ్యక్తం చేశాడు. రెండు దేశాలు మాట్లాడుకోవాలని అఫ్రిది అన్నాడు. అఫ్రిది ప్రకారం.. మన సమస్యలకు చర్చలే ఏకైక పరిష్కారమని.. పోరాటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నాడు.

పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌తో జలాల పంపక ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. భారత్ కూడా పాకిస్థాన్‌తో సరిహద్దును మూసివేసింది. దీంతో పాటు పాకిస్థాన్ దౌత్యవేత్తల వీసాలను కూడా భారత్ రద్దు చేసింది. పాకిస్థాన్ కూడా భారతీయుల వీసాలను రద్దు చేసింది. అదే సమయంలో సింధు నది నీటిని భారత్ ఆపేస్తే దానిని యుద్ధచర్యగా పరిగణిస్తామని పాక్ హెచ్చరిక జారీ చేసింది.
ఐక్యరాజ్యసమితి నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన తన హామీని భారత్ ఇంకా నెరవేర్చలేదు. ఆధారాలు లేకుండా భారత్ పాకిస్థాన్‌పై ఆరోపణలు చేయకూడదని అఫ్రిది అన్నాడు. ఇరుదేశాల మధ్య చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన చెప్పుకొచ్చాడు.