ఆఫ్రిది మెచ్చిన నాలుగు మంది ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లలో 'కోహ్లీ'.. మిగతావారు ఎవరంటే?

హైదరాబాద్: ప్రస్తుత క్రికెట్‌లో తనకు నచ్చిన నలుగురు ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ల పేర్లను పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది తెలిపాడు. ఆఫ్రిది మెచ్చిన నాలుగు మంది ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. శనివారం ట్విటర్ వేదికగా #AskLala పేరుతో ఆఫ్రిది అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆఫ్రిది సమాధానాలు ఇచ్చాడు.

ఒక్కరిని ఎంపిక చేసుకోవడం కష్టం:
'#AskLala'లో భాగంగా ఓ అభిమాని ప్రస్తుత క్రికెట్‌లో మీకు నచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరని ఆఫ్రిదిని ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీతో పాటు పాక్ ఓపెనర్ బాబర్ అజామ్, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తన ఫేవరెట్ ఆటగాళ్లని ఆఫ్రిది సమాధానం ఇచ్చాడు. అయితే బాబర్, కోహ్లీలలో ఫేవరెట్ ఎవరు అని మరో అభిమాని అడగ్గా.. 'ఇద్దరిలో ఒక్కరిని ఎంపిక చేసుకోవడం చాలా కష్టం. ఇద్దరూ నచ్చిన ఆటగాళ్లే' అని ఆఫ్రిది పేర్కొన్నాడు.

ఆఫ్రిది ప్రశంసలు
'ప్రస్తుతం కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతడు అసాధారణ రీతిలో ఆడుతున్నాడు. ప్రతీ మూడు మ్యాచ్‌లకు ఒక హాఫ్ సెంచరీ చేస్తున్నాడు. అతని ఆట ఎప్పుడూ చూడాలనిపిస్తోంది' అంటూ ప్రశంసించాడు. బాబర్ అజమ్ కూడా టీ20ల్లో 50కి పైగా సగటుతో రాణిస్తున్నాడు. రూట్, స్మిత్‌లు టెస్టుల్లో గొప్పగా ఆడుతున్నారని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు.

ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు
కోహ్లీ టీ20ల్లో 71 మ్యాచ్‌ల్లో 50.58 సగటు పరుగులు చేసాడు. బాబర్ 30 మ్యాచ్‌ల్లోనే 54.21 సగటుతో పరుగులు చేసాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో కోహ్లీ (72 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగి టీమిండియాని గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌తో భారత కెప్టెన్ మూడు ఫార్మాట్లలో 50కిపైగా సగటు కలిగిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఐసీసీ చేసిన ట్వీట్‌కు అఫ్రిది స్పందించి కోహ్లీని అభినందించాడు.

నువ్వొక అసాధారణ ఆటగాడివి
రెండో టీ20లో కోహ్లీ 72 పరుగులు చేయడంతో ఆఫ్రిది ప్రశంసల జల్లు కురిపించాడు. ' కోహ్లీ నువ్వొక అసాధారణ ఆటగాడివి. నీ సక్సెస్ ఇలానే కొనసాగాలి. ప్రపంచంలోని క్రికెట్ అభిమానుల్ని నీ ఆట తీరుతో మరింత అలరించు' అంటూ ఆఫ్రిది ట్వీట్ చేశాడు. ఆఫ్రిది ట్వీట్‌పై భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications